బిర్యానీ చేసిన జాన్వీ కపూర్‌... మెచ్చుకున్న అర్జున్ రెడ్డి ఫ్యామిలీ..

Instagram/janhvikapoor

నిన్న ఆదివారం కావడంతో కాస్తా రొటీన్‌కు భిన్నంగా వంట గదిలోకి అడుగుపెట్టింది జాన్వీ. ఏదైనా ఓ వంటను ఇరగదీయాలనీ చూసిన జాన్వీ... దీర్ఘంగా ఆలోచించి బిర్యానీ చేయడానికి సిద్ధమైంది.

 • Share this:
  Janhvi Kapoor : జాన్వీ కపూర్‌.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి..  ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌'కు రీమేక్ వచ్చింది.  ప్రస్తుతం జాన్వీ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రుహీ అఫ్జా', 'తక్త్‌’ సినిమాలతో బాలీవుడ్‌లో సూపర్ బీజీగా గడుపుతోంది. అది అలా ఉండగా.. నిన్న ఆదివారం కావడంతో కాస్తా రొటీన్‌కు భిన్నంగా వంట గదిలోకి అడుగుపెట్టింది జాన్వీ. ఏదైనా ఓ వంటను ఇరగదీయాలనీ చూసిన జాన్వీ... దీర్ఘంగా ఆలోచించి వెజిటబుల్‌ బిర్యానీ చేయడానికి సిద్ధమైంది. అనుకున్నదే తడువుగా.. వంట స్టార్ట్ చేసిన జాన్వీ.. మధ్య మధ్యలో సందేహాలు వచ్చినప్పుడు హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ సహాయం తీసుకున్నారంట. షాహిద్ ఇటీవలే తెలుగు అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి బంపర్ హిట్ అందుకున్నాడు.

  janhvi kapoor cooks biryani,janhvi kapoor cooked red vegetable biryani,janhvi kapoor,jhanvi kapoor,jhanvi kapoor movie,how to make vegetable biryani,biryani recipe,vegetable biryani recipe,veg biryani,chicken biryani,how to make vegetable biryani in cooker,janhvi kapoor video,janhvi kapoor latest,jhanvi kapoor dhadak celebration,jhanvi kapoor vogue,jhanvi kapoor biography,jhanvi kapoor lifestyle,jhanvi kapoor family,jhanvi kapoor bio,janhvi kapoor cooked red vegetable biryani,
  Instagram/mira.kapoor


  జాన్వీ అంత కష్ట పడిచేసిన వెజిటబుల్‌ బిర్యానీని హిందీ అర్జున్ రెడ్డితో పాటు ఆయన భార్య మీరా రాజ్ పుత్, ధడక్ హీరో ఇషాన్‌ కట్టర్ రుచి చూసి వావ్ జాన్వీ అంటు మెచ్చుకున్నారట. ఆ తర్వాత ఈ గ్యాంగ్ అంతా కలిసి ఆదివారం లంచ్ చేశారు. అంతేకాకుండా షాహిద్ భార్య, మీరా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో జాన్వీ చేసిన వెజిటబుల్‌ బిర్యానీని షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌లో ‘‘రెడ్‌ రైస్‌ వెజిటబుల్‌ బిర్యానీ చేసిన జాన్వీను మెచ్చుకోవాల్సిందే’’ అంటూ రాసింది.   
  View this post on Instagram
   

  Sorry for the spam guyz


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  అది అలా ఉండగా.. జాన్వీ కపూర్‌ను పూరి జగన్నాథ్ తెలుగులో పరిచయం చేయనున్నాడని టాక్. పూరీ, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో 'ఫైటర్' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే మాత్రం ఈ విషయంపై పూరి  స్పందించాల్సిందే.

   
  Published by:Suresh Rachamalla
  First published: