శ్రీదేవి తన కూతురు విషయంలో అలా వుండేదా.. జాన్వీ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆశ్చర్యం..

Instagram/janhvikapoor

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.

  • Share this:
    Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న రెండో చిత్రం ‘గుంజన్ సక్సేనా’.  ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. 'ధడక్' సినిమాతో జాన్వీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 'సైరాట్' చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ లో బాగానే ఆడింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో నార్త్ ప్రేక్షకులని మెప్పించిన జాన్వీ, ప్రస్తుతం గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లి గురించి ఓ ప్రముఖ మ్యాగజైన్‌తో మాట్లాడింది జాన్వీ. ఆమె మాట్లాడుతూ.. నా పెళ్లి  ఎంతో సంప్రదాయబద్ధంగాజరుగుతందని తెలుసు. నేను పెళ్లంటూ చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుంటాను. పెళ్లికి కాంజీవరం జరీ చీర కట్టుకుంటాను. పెళ్లయ్యాక నాకు ఎంతో ఇష్టమైన దక్షిణాది వంటకాలైన.. ఇడ్లీ సాంబార్, పెరుగన్నం, పాయసంతో ఘనంగా విందు ఇస్తాను అని తెలిపింది.
    కాగా.. ఎప్పుడు అమ్మ శ్రీదేవి టాపిక్ వచ్చినా ఎమోషనల్ అయ్యే జాన్వీ..  ఈ సందర్భంగా తనపై తన తల్లి శ్రీదేవికి నమ్మకం ఉండేది కాదని, తాను ఎక్కడ ప్రేమలో పడతానని తన తల్లి శ్రీదేవి భయపడుతూ ఉండేదని, పెళ్లి వయసు వచ్చినపుడు తానే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తల్లి శ్రీదేవి ఎప్పుడూ చెబుతూ ఉండేదని జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న వాళ్లు మాత్రం ఒకింత ఆశ్చర్య పోతున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీదేవి, సొంత కూతురికి ఇలాంటీ రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి? జాన్వీ అంత అమాయకురాలా? లేక ఆమె అందరినీ అంత ఈజీగా నమ్మేసి మోసపోతుందనే భయం శ్రీదేవికి ఉండేదా అని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలకి సమాధానం చెప్పడానికి శ్రీదేవి ఇప్పుడు లేదు కానీ.. ఇప్పుడిప్పుడే కెరీర్ సెట్ చేసుకునే పనిలో ఉన్న జాన్వీ, అమ్మలాగా టాప్ హీరోయిన్ అవుతుందని భావించిన వాళ్లు మాత్రం కెరీర్ చూసుకోకుండా ఇప్పుడు ఈ పెళ్లి టాపిక్ ఎందుకని చర్చించుకుంటున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published: