news18-telugu
Updated: January 12, 2021, 5:13 PM IST
Janhvi Kapoor Belly Dance goes viral
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్..తల్లి అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగ ప్రవేశం చేయడమే కాకుండా నటనలో ఓనమాలు దిద్దుతూ వెండితెరపై ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటోంది. దఢక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బెల్లీ డాన్స్ వీడియో హల్ చల్ చేస్తుంది. 'సన్ సనన.. ' అనే పాటకు నడుము ఊపుతూ జాన్వీ వేసి బెల్లీ స్పెప్పులు చూస్తే కుర్రకారు మనసు గతి తప్పడం ఖాయం. ఈ వీడియోను పోస్ట్ చేసిన జాన్వీకపూర్.. పాండమిక్ సమయంలో బెల్లీ డాన్సుల సెషన్‌ను మిస్ అయ్యానంటూ మెసేజ్కూడా పోస్ట్ చేసింది.
జాన్వీకపూర్ ఇప్పటికే పలు సందర్భాల్లో తన డాన్సింగ్ వీడియోలతో ఫాలోవర్స్‌ను, ఫ్యాన్స్‌ను అలరించింది. అయితే ఈసారి రొటీన్ డాన్స్ వీడియోలకు భిన్నంగా పోస్ట్ చేసిన బెల్లీ డాన్స్ వీడియో నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోసారి జాన్వీ మంచి నటే కాదు.. మంచి డాన్సర్ అని కూడా ప్రూవ్ చేసుకుందంటూ వీడియో చూసిన వారందరూ అంటున్నారు. ఈ బెల్లీ డాన్స్ చూసిన వారందరూ షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం జాన్వీకపూర్ రూహీ అఫ్జానా, దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు మన టాలీవుడ్ మేకర్స్ కూడా జాన్వీ కపూర్‌ను దక్షిణాదిన నటింప చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రీసెంట్ టైమ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ 'ఛత్రపతి' సినిమాలో హీరోయిన్గా జాన్వీని నటించమని అప్రోచ్ అయినట్లు వార్తలు వినిపించాయి.
Published by:
Anil
First published:
January 12, 2021, 5:13 PM IST