తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాకు భయం లేదు. గౌరవం మాత్రమే ఉన్నాయని జనసేన పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్ధి నాగబాబు వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇధి టీజర్ మాత్రమే.. మే 23 ఫలితాల తర్వాత అసలు సినిమా ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంటర్మీడియల్ ఫలితాలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు విద్యార్ధుల సమస్య గురించి కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము లేదు. తెలంగాణలో పనిచేసే దమ్ము, ధైర్యం జవాబుదారితనం ఒక్క జనసేనకే ఉందన్నారు. మరోవైపు నాగబాబు నర్సాపురంలో పర్యటిస్తూ అక్కడ సమస్యల గురించి ప్రస్తావించారు. అంతేకాదు తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పవన్ 2014లో పార్టీ పెట్టినా.. అంతకు ముందు 2000 నుంచే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌లో తాను తినే ఆహారాన్ని పక్కవాడికే పెట్టే గుణం ఉంది. అంతెేకాదు ఎక్కువగా మాట్లాడడు. అవసరం వస్తే ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తాడన్నారు. అంతేకాదు చిన్నప్పటి నుంచి దారి తప్పిన వ్యవస్థను చక్కదిద్దాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్‌లో చూసానన్నారు.
నాగబాబు,పవన్ కళ్యాణ్
అంతేకాదు జనసేన గెలుపు కోసం అభిమానులు, కార్యకర్తలు 10 రూపాయలు ఆశించకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. నా వంతుగా నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా ఎన్నికైనా కాకపోయినా.. ఈ నియోజకవర్గంలోనే స్థిరపడడానికి నిశ్చయించకున్నానన్నారు. మరోవైపు పార్టీ పొలిటికల్ సెక్రటరీ హరి ప్రసాద్ ట్లాడుతూ శాంతి కాముకలైన విశాఖ ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తినే ఎన్నుకుంటారని మొన్న జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అర్థమవుతుందన్నారు. అంతేకాదు మినీ ఇండియా లాంటి విశాఖ పట్నం సమస్యలు తీరాలంటే నిస్వార్థ పరుడైన పవన్ కళ్యాన్ వల్లే సాధ్యమవుతుందన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.