Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 26, 2020, 10:15 PM IST
నాగబాబు, వైఎస్ జగన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకం వ్యవహారం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిపారు. మంచు మనోజ్ కూడా దీనిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. దేవుడు అమ్మమని చెప్పాడా అంటూ ప్రశ్నించాడు. ఇక ఇప్పుడు నాగబాబు కూడా తనవంతుగా ముందుకొచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా దీనిపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు స్పందించాడు.
టీటీడీ భూముల విక్రయాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపాడు ఈయన. ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. 'టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు' అని ట్వీట్ చేశాడు నాగబాబు. ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొన్నటికి మొన్న గాంధీని టార్గెట్ చేసి ఈయన చేసిన ట్వీట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 26, 2020, 10:05 PM IST