హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan: తెలంగాణ వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: తెలంగాణ వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Pawan Kalyan Donates Rs 1 Crore to Telangana CM Releaf Fund | గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వరదలతో అల్లాడుతున్న నగరవాసులకు టాలీవుడ్ అండగా నిలుస్తోంది. ఇప్పటికే పలువురు నటులు తమ వంతు విరాళాన్ని ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి రూ. కోటి విరాళం ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan Donates Rs 1 Crore to Telangana CM Releaf Fund | గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువు కట్టలు తెగి ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల జీవితాలు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేస్తుంది. ఈ క్రమంలో పలువురు సినీ హీరోలు తెలంగాణ సహాయ నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు. ముందుగా నందమూరి నట సింహం బాలకృష్ణ .. హైదరాబాద్ వరద బాధితులకు రూ. 1.50 కోటి విరాళం ప్రకటించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు రూ. కోటి విరాళం ప్రకటించారు. అటు  నాగార్జున,ఎన్టీఆర్, రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. అటు  విజయ్ దేవరకొండ రూ. 10 లక్షలు, రామ్ రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ .. రూ. కోటి ఆర్ధిక సాయం ప్రకటించారు.

  వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన నగరవాసులకు తమ వంతుగా ఈ సాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు సినీ దర్శకులు త్రివక్రమ్ తన వంతుగా రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు  హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చెరో రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థలు హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ చరో రూ.10 లక్షల విరాళం ప్రకటించి తమ ఉదారతను చాటుకున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hyderabad Floods, Janasena, Pawan kalyan, Telangana Government, Tollywood

  ఉత్తమ కథలు