Home /News /movies /

JANASENA CHIEF PAWAN KALYAN WISHED MINISTER KTR ON HIS BIRTHDAY PRV

KTR Birthday| Pawan kalyan: మంత్రి కేటీఆర్​కు జనసేన అధినేత పవన్​ కల్యాణ్ బర్త్​డే విషెష్​.. ఏమన్నారంటే?

Pawan Kalyan  KTR Photo : Twitter

Pawan Kalyan KTR Photo : Twitter

మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్విటర్​లో ఓ పోస్టు పెట్టింది.

    తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కేటీఆర్కు పుట్టిన రోజు (KTR Birthday) శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు (Mahesh babu), రామ్​చరణ్​ (ram Charan), రామ్ గోపాల్ వర్మ, గోపీచంద్ మలినేని, శ్రీనువైట్ల, సోనూసూద్, హరీశ్ శంకర్, అనసూయ, బండ్ల గణేశ్ తదితరులు మంత్రికి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. ఇందుకు ప్రతిస్పందనగా కేటీఆర్ (KTR) కూడా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు జనసేన (Janasena) పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    కాలికి తగిలిన గాయం వల్ల ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసిందని , ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.



    ఇక రామ్​చరణ్ (Ram charan)​ విషెష్​ తెగ వైరల్​ అవుతోంది. నా ప్రియమైన సోదరుడు, ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు కేటీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు చెర్రీ.



    దీనికి స్పందించిన కేటీఆర్ 'థ్యాంక్స్ బ్రదర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నీ నటన గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విన్నాను. త్వరలోనే ఆ సినిమాను తప్పకుండా చూస్తాను' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పార్టీ ఎక్కడ భాయ్ అంటూ అడిగారు. అందుకు కేటీఆర్ థ్యాంక్స్ భాయ్ అంటూ రిప్లై ఇచ్చారు.

    హ్యాపీ బర్త్ డే డియర్ రామ్ అంటూ చిరంజీవి..

    చిరంజీవి ట్వీట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే డియర్ రామ్, పుట్టిన రోజు శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలిపారు.  ఏపీకి చెందిన రాజకీయ నాయకులు ప్రస్తుత ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విజయసాయి రెడ్డి, గంటా శ్రీనివాసరావు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాక, యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్ కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా, కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీకు ఇంతకన్నా వేరే ఫోటో దొరకలేదా అంటూ సరదాగా కామెంట్ చేశారు. భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓ,ఫెర్రెల్ కూడా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Birthday, Janasena, Minister ktr, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు