Home /News /movies /

JANASENA CHIEF PAWAN KALYAN TWISTING COMMENTS ON MAA ELECTIONS JUST BEFORE MANCHU MOHAN BABU REACTION MKS

మంచు దెబ్బ కాచుకున్న Pawan Kalyan? -MAA Electionsపై ట్విస్టింగ్ కామెంట్స్ -స్వయంగా పోటీపై..

మా ఎన్నికలపై పవన్ కల్యాణ్

మా ఎన్నికలపై పవన్ కల్యాణ్

pawan kalyan on MAA Elections | సాధారణ ఎన్నికలను తలపించేలా రసవత్తరంగా సాగిన టాలీవుడ్ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలపై సీనియర్ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణల మధ్య మా ఎన్నికల పోలింగ్ ఆదివారం కొనసాగుతున్నది. సాయంత్రంలోగా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ మీడియాతో మాట్లాడుతూ స్టన్నింగ్ కామెంట్లు చేశారు..

ఇంకా చదవండి ...
మా ఎన్నికల నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ముందు నుంచీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు అండగా నిలవడం, సైద్ధాంతికంగా విరోధాన్ని పక్కనపెట్టి ప్రకాశ్ రాజ్ కు పవన్ బహిరంగంగా మద్దతు పలకడం, ఆ క్రమంలో (ఎన్నికల) ప్రత్యర్థి మంచు ఫ్యామిలీని ఉద్దేశించి సేనాని వ్యాఖ్యలు చేయడం, ప్రకాశ్ రాజ్ తరఫున పవన్ సోదరుడు నాగబాబు ఏకంగా ప్రత్యర్థి మంచు విష్ణుపై సంచలన ఆరోపణలు చేయడం లాంటి పరిణామాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. కాగా, మెగా ఫ్యామిలీ విమర్శలకు, ప్రత్యేకించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఇవాళ(అక్టోబర్ 10న) బదులు చెబుతానని మోహన్ బాబు ఇదివరకే ప్రకటించారు. పోలింగ్ ముగిసిన తర్వాత మంచు ఫ్యామిలీ ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండగా, ఈ ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన పవన్.. స్నేహరాగం వినిపించారు. అసలు మా ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా? అని ప్రశ్నించారు. ఎన్నికల బరిలో తానెందుకు నిలబడలేదో వివరణ ఇచ్చుకున్నారు..తిప్పికొడితే 900.. ఇంత రచ్చా?
‘గతంలో ఏనాడూ మా ఎన్నికల్లో ఈ స్థాయి పోటీని నేను చూడలేదు. దిగ్గజాలతో బలంగా డిబేట్ జరిపిన వ్యక్తి ప్రకాశ్ రాజ్. అయితే, ఈ ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా? తిప్పికొడితే 900ల ఓట్లున్నాయి. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా? వ్యక్తిగత విసుగులు సినిమా పరిశ్రమపై రుద్దడం అవసరమా? అన్నం పెట్టే పరిశ్రమను కించరపర్చొచ్చా? ప్రతిచోటా పంతాలు, పట్టింపులు ఉంటాయి, కానీ వ్యక్తులు చేసే పని సినీ రంగానికి అంటడానికి వీల్లేదు.’అని పవన్ హితవు పలికారు.

మోహన్ బాబు స్నేహితుడే..
మా ఎన్నికల పోలింగ్ వేళ మంచు విష్ణు ప్యానెల్ ఓటర్లకు డబ్బులు పంచుతోందన్న ఆరోపణలపై ప్రకాశ్ రాజ్ సమర్థకుడైన పవన్ కల్యాణ్ ఆచితూచి స్పందించారు. డబ్బుల పంపకం గురించి తనకు సమాచారం లేదన్నారు. అయితే, ఫలితాలు ఎలా ఉన్నా, గెలిచేది ‘మా’నే అని, మా సభ్యుల్లో చీలిక అనేది రాబోదని, సినిమా ఇండస్ట్రీ చీలడమనే ప్రశ్నే ఉత్పన్నం కాబోదని పవన్ స్పష్టం చేశారు. మంచు ఫ్యామిలీతో విభేధాలు లేవనే అర్థంలో.. ‘మోహన్ బాబు, అన్నయ్య(చిరంజీవి) ఇద్దరూ మంచి స్నేహితులే. సినిమా వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలి. అసలు మా ఎన్నికలకు ఇంత హైప్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు..’అని జనసేనాని అన్నారు.

అందుకే నేను పోటీ చేయలేదు..
ఎన్నికల్లో పోటీ అనేది సరదాగా ఉండాలేగానీ, సీరియస్ గా ఉండరాదని, పంతాలు, పట్టింపులకు ఇది సందర్బం కారాదని పవన్ కల్యాణ్ అన్నారు. సైజులో సినీ పరిశ్రమ చిన్నదే అయినా, దాని ప్రభావం చాలా పెద్దదని, అందరూ ఆదర్శవంతంగా నడుచుకోవాలని సూచించారు. కాగా, హైవోల్టేజీ మా ఎన్నికల్లో స్వయంగా బరిలోకి దిగే అంశంపై స్పందిస్తూ.. వరుస షూటింగ్స్ వల్ల బిజీగా ఉన్నందున మా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయానని చెప్పారు. ఆదివారం మద్యాహ్నం 3 గంటల తర్వాత వెలువడే ఫలితాలతో మా కింగ్ ఎవరో తేలిపోనుంది. 2 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకు రానున్న మంచు మోహన్ బాబు.. పవన్ కల్యాణ్ పై ఎలాంటి రియాక్షన్ ఇస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నది...
Published by:Madhu Kota
First published:

Tags: MAA Elections, Manchu mohan babu, Pawan kalyan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు