లోకేష్ బాటలో నోరు జారిన జనసేనాని పవన్ కళ్యాణ్..

ఎలక్షన్ ప్రచారం సందర్భంగా గత  కొన్ని రోజులుగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ పలు సందర్భాల్లో నోరు జారి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా లోకేష్ బాటలో పవన్ కళ్యాణ్ నోరు జారీ వార్తల్లో నిలిచారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 11, 2019, 2:27 PM IST
లోకేష్ బాటలో నోరు జారిన జనసేనాని పవన్ కళ్యాణ్..
నారా లోకేశ్, పవన్ కళ్యాణ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 11, 2019, 2:27 PM IST
ఎలక్షన్ ప్రచారం సందర్భంగా గత  కొన్ని రోజులుగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ పలు సందర్భాల్లో నోరు జారి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన,బీజేపీకి చెందిన పార్టీ శ్రేణులతో పాటు సామాన్య జనాలు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా జనసేనాని కూడా లోకేష్ బాటలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈ విషయాన్ని ఉద్దేశించి జనసేనాని .. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయని చెప్పడానికి బదులు ఈఎంఐలు అని పలకారు. ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో టీడీపీతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ లోకేష్‌‌కు తోడుగా జనసేనాని పవన్ కళ్యాణ్ దొరకడం చూసి టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

పవన్ కళ్యాణ్ ఫసక్ : లోకేష్ బాటలో నోరు జారిన జనసేనాని..


First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...