Pawan Kalyan : మళ్లీ టాలీవుడ్ వైపు పవన్ కళ్యాణ్ చూపు... కారణాలు ఇవీ...

Andhra Pradesh : సినిమా ఇండస్ట్రీ లోంచీ రాజకీయాల్లోకి వెళ్లిన వారు... తిరిగి ఇండస్ట్రీలోకి రావడం సహజమే. సెప్టెంబర్ 2న పుట్టిన రోజు సందర్భంగా జనసేన అధినేత కీలక ప్రకటన చెయ్యబోతున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 10:50 AM IST
Pawan Kalyan : మళ్లీ టాలీవుడ్ వైపు పవన్ కళ్యాణ్ చూపు... కారణాలు ఇవీ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Krishna Kumar N | news18-telugu
Updated: September 1, 2019, 10:50 AM IST
Janasen Chief : మెగాస్టార్ చిరంజీవి... పాలిటిక్స్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించినప్పుడు ఆయన అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. ఐతే... రాజకీయాలు కలిసిరాకపోవడం, సినిమాలకు దూరమవ్వడంతో చిరు... దాదాపు 8 ఏళ్లు తీవ్ర ఆవేదన చెందారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చి... ఖైదీ నంబర్ 150తో అభిమానులను అలరించారు. ఇప్పుడు సైరాతో మళ్లీ టాలీవుడ్ రికార్డుల్ని బద్దలుకొట్టేలా ఉన్నారు. ఇదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరుగుతోంది. ఆయన కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి... పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఐదేళ్లుగా... ప్రజల మధ్యే ఉన్నా... జనసేన పార్టీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఐతే... తమకు పడిన ప్రతి ఓటూ... నిజాయితీగా పడినదే అంటూ... పవన్... రాజకీయాల్ని వదిలే ప్రసక్తే లేదని పదే పదే చెప్పారు. అదే సమయంలో ఆయన సినిమాల్లోకి మళ్లీ వెళ్లే ప్రసక్తి లేదని కూడా చెప్పారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే... సినిమాలు కూడా చెయ్యాలన్నది ఆయన అభిమానుల ఆశ. ఎలాగూ... ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది. ఇప్పట్లో... ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి... మళ్లీ ఎన్నికలు నాలుగేళ్ల తర్వాతే (జమిలి ఎన్నికలైతే 2023లో) కాబట్టి... ఈ లోగా... రాజకీయాల్లో ఉంటూనే... మధ్యమధ్యలో సినిమాలు కూడా చెయ్యాలని కోరుతున్నారు ఆయన ఫ్యాన్స్. దీనివల్ల చాలా లాభాలున్నాయి.

ఒకటి - పవన్ కళ్యాణ్‌కి వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. దాన్ని ఆయన పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు.

రెండు - ఫ్యాన్ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుంది. సామాజిక కార్యక్రమాలు చేయడానికి ఆ ఫ్యాన్స్‌ని పవన్ ఉపయోగించుకోవచ్చు.


మూడు - పవన్ తన అభిప్రాయాల్ని మాస్ మీడియా ద్వారా ఎక్కువ మందికి బలంగా చెప్పేందుకు వీలవుతుంది.

వ్యక్తిగత ప్రయోజనాలతోపాటూ... సమాజానికీ ఉపయోగపడే అవకాశాలు ఉండటంతో... పవన్ కళ్యాణ్... తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారనీ, ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 2న... తన 48వ పుట్టిన రోజు నాడు ఆయన కీలక ప్రకటన చెయ్యబోతున్నారని తెలిసింది. పవన్ సినిమాల్లోకి రావాలనుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలిసింది. అంచనాల్ని అందుకోలేకపోయిన అజ్ఞాతవాసి సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ సినిమా నిర్మాతైన రాధాకృష్ణ, తన హారిక హాసిని సంస్థపై పవన్ నెక్ట్స్ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా రాధాకృష్ణకు హిట్ సినిమా అందించాలని పవన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా ద్వారా... పవన్ కళ్యాణ్ సమాజంలో రావాల్సిన మార్పులపై కొన్ని కీలకమైన డైలాగ్స్ చెబుతారని సమాచారం.

ఇక వినాయకచవితి రోజే పుట్టిన రోజు జరుపుకోబోతున్న తమ అభిమాన నటుడి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్... ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పవన్ టాలీవుట్ రీఎంట్రీపై ప్రకటన చేస్తే... తమకు అంతకంటే కావాల్సింది ఇంకేముంది అంటున్నారు. మరి పవర్ స్టార్... మనసులో మాట ఏంటో కచ్చితంగా తెలియాలంటే... మనం రేపటి దాకా ఆగాల్సిందే.
First published: September 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...