తెలుగు హీరోలకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. మీతో ఎవరికి లాభం..?

పవన్ కల్యాణ్ అంటే ఇప్పుడు హీరో అనాలో లేదంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు హీరోగా రికార్డులు తిరగరాసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు జనసేన పనులతో బిజీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 3:51 PM IST
తెలుగు హీరోలకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. మీతో ఎవరికి లాభం..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
  • Share this:
పవన్ కల్యాణ్ అంటే ఇప్పుడు హీరో అనాలో లేదంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు హీరోగా రికార్డులు తిరగరాసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు జనసేన పనులతో బిజీ అయిపోయాడు. పార్టీ ఓడినా.. తాను ఓడిపోయినా కూడా జనాల మధ్యే కనిపిస్తున్నాడు. కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనూ ఉంటున్నాడు పవన్. తెలుగు భాషను కాపాడండంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాడు పవర్ స్టార్. మన భాషను కాపాడుకుందాం.. ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుందామంటూ గళమెత్తుతున్నాడు.
Janasena Chief Pawan Kalyan sensational comments on Tollywood and pleading for Telugu language pk పవన్ కల్యాణ్ అంటే ఇప్పుడు హీరో అనాలో లేదంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు హీరోగా రికార్డులు తిరగరాసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు జనసేన పనులతో బిజీ.. pawan kalyan,pawan kalyan twitter,jansena pawan kalyan,janasena twitter,pawan kalyan movies,pawan kalyan telugu bhasha,pawan kalyan tollywood heroes,pawan kalyan fires on telugu heroes,pawan kalyan janasena party,telugu cinema,పవన్ కల్యాణ్,తెలుగు భాషపై పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ జనసేన,జనసేన పార్టీ ప్రచారంలో పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ టాలీవుడ్
పవన్ కల్యాణ్

పవన్ వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి తెలుగు ఇండస్ట్రీపై కూడా తన ఫోకస్ పెట్టాడు జనసేనాని. ఇప్పటి వరకు ఇండస్ట్రీని ఒక్క మాట కూడా అనని ఈయన.. ఇప్పుడు ఏకంగా హీరోలపైనే పడ్డాడు. సంచలన వ్యాఖ్యలు చేసాడు.. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని.. అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా అంటూ విమర్శలు చేసాడు పవన్ కల్యాణ్. నిజంగానే మన ఇండస్ట్రీలో మహేష్ బాబు సహా మరికొందరు హీరోలకు తెలుగు చదవడం రాయడం రాదు.. కానీ వాళ్లు అవేం తెలియకుండా చక్కగా తమ పని తాము చేసుకుంటున్నారు.

Janasena Chief Pawan Kalyan sensational comments on Tollywood and pleading for Telugu language pk పవన్ కల్యాణ్ అంటే ఇప్పుడు హీరో అనాలో లేదంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు హీరోగా రికార్డులు తిరగరాసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు జనసేన పనులతో బిజీ.. pawan kalyan,pawan kalyan twitter,jansena pawan kalyan,janasena twitter,pawan kalyan movies,pawan kalyan telugu bhasha,pawan kalyan tollywood heroes,pawan kalyan fires on telugu heroes,pawan kalyan janasena party,telugu cinema,పవన్ కల్యాణ్,తెలుగు భాషపై పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ జనసేన,జనసేన పార్టీ ప్రచారంలో పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ టాలీవుడ్
పవన్ కల్యాణ్ (Source: Twitter)

కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్‌లో తెలుగు దిగజారిపోతుందని.. దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు నటులపై కూడా ఉందని గుర్తించుకోవాలంటున్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సెటైర్లు కూడా పేలుతున్నాయి. అప్పట్లో తన ప్రతీ సినిమాలో కూడా ఇంగ్లీష్, హిందీ పాటలను పెట్టాడు పవర్ స్టార్. మరి అప్పుడు తెలుగు గురించి ఏం తెలియలేదా అంటూ జనసేనానిపై పంచులు పడుతున్నాయి. మొత్తానికి పవన్ తెలుగు ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్‌కు ఇక్కడ్నుంచి ఎవరొచ్చి సమాధానం చెప్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...