పవన్ కల్యాణ్ మంచి మనసు.. కేన్సర్‌తో బాధ పడుతున్న అభిమానికి విరాళం..

పవన్ కల్యాణ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి మనసున్న మనిషి కూడా. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరే ఉంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 4:55 PM IST
పవన్ కల్యాణ్ మంచి మనసు.. కేన్సర్‌తో బాధ పడుతున్న అభిమానికి విరాళం..
అభిమానిని కలిసిన పవన్ కల్యాణ్
  • Share this:
పవన్ కల్యాణ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి మనసున్న మనిషి కూడా. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరే ఉంటారు. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా అతన్ని అభిమానించే వాళ్లు మాత్రం తగ్గిపోరు. ఇక పవన్ కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులను కలుసుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కేన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించాడు పవర్ స్టార్. అంతేకాదు.. ఆయన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు కూడా. పవన్ అంటే ప్రాణం ఇచ్చే అభిమాని పాతకూటి బూడిగయ్య.
Janasena Chief Pawan Kalyan met his fan in party office who is suffering from cancer pk పవన్ కల్యాణ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి మనసున్న మనిషి కూడా. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరే ఉంటారు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan fans,jansena chief pawan kalyan,janasena twitter,janasena facebook,janasena party,pawan kalyan fan cancer,pawan kalyan money cancer fan,pawan kalyan movies,pawan kalyan fan cancer,pawan kalyan janasena party,janasena party hyderabad,telugu cinema,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ సినిమాలు,పవన్ కల్యాణ్ జనసేన ఛీఫ్,అభిమానికి సాయం చేసిన పవన్ కల్యాణ్,తెలుగు సినిమా
అభిమానిని కలిసిన పవన్ కల్యాణ్

ఈయనకు కొన్నేళ్ల నుంచి కేన్సర్ ఉంది. విషయం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అతడికి వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతేకాదు బూడిగయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వినాయకుడి విగ్రహాన్ని అందించాడు పవర్ స్టార్. ప్రకాశం జిల్లా అన్నసముద్రం బూడిగయ్య ఊహ తెలిసిన నాటి నుంచే పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. తన ఆరోగ్యం అలా ఉన్నప్పటికీ కూడా పవన్ అంటే ఉన్న అభిమానంతో జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఈ మధ్యే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది.

Janasena Chief Pawan Kalyan met his fan in party office who is suffering from cancer pk పవన్ కల్యాణ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి మనసున్న మనిషి కూడా. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరే ఉంటారు. pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan fans,jansena chief pawan kalyan,janasena twitter,janasena facebook,janasena party,pawan kalyan fan cancer,pawan kalyan money cancer fan,pawan kalyan movies,pawan kalyan fan cancer,pawan kalyan janasena party,janasena party hyderabad,telugu cinema,పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ సినిమాలు,పవన్ కల్యాణ్ జనసేన ఛీఫ్,అభిమానికి సాయం చేసిన పవన్ కల్యాణ్,తెలుగు సినిమా
అభిమానిని కలిసిన పవన్ కల్యాణ్

దాంతో తనకు ఎలాగైనా పవన్‌ను కలవాలని ఉందని.. మాట్లాడాలని ఉందని చెప్పడంతో స్థానికంగా ఉండే జనసేన నేతలు ఈ మాటను పవన్ చెవిన వేసారు. దాంతో బూడిగయ్యను హైదరాబాద్‌ ప్రశాసన్ నగర్‌లోని జనసేన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చి పవన్ తన అభిమాని బూడిగయ్యను పరామర్శించాడు. లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా వినాయకుడి విగ్రహం ఇచ్చాడు. తన కోసం పాటు పడే వాళ్లను వదులుకోనని చెప్పాడు పవన్. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు.. తన అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటానని పవన్ ఈ సందర్భంగా తెలిపాడు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు