శ్రీ రెడ్డికి పవన్ కళ్యాణ్ వార్నింగ్.. పాత మనిషిని అయ్యుంటే తాట తీసేవాన్ని..

Pawan Kalyan Sri Reddy: శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు పక్కపక్కన బెడితే ఏదో వైబ్రేషన్ వస్తుంది. ఇండస్ట్రీలో ఎవరికైనా గుర్తింపు రావాలంటే ఈజీ పద్దతి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం అని కొందరు ఇప్పటికే నిరూపించారు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 15, 2020, 4:30 PM IST
శ్రీ రెడ్డికి పవన్ కళ్యాణ్ వార్నింగ్.. పాత మనిషిని అయ్యుంటే తాట తీసేవాన్ని..
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
  • Share this:
శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు పక్కపక్కన బెడితే ఏదో వైబ్రేషన్ వస్తుంది. ఇండస్ట్రీలో ఎవరికైనా గుర్తింపు రావాలంటే ఈజీ పద్దతి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం అని కొందరు ఇప్పటికే నిరూపించారు కూడా. పనికి మాలిన వాళ్లు కూడా మా పవన్‌ను తిట్టి పేరు తెచ్చుకున్నారు కదరా అంటూ పవర్ స్టార్ అభిమానులు ఇప్పటికీ కత్తి మహేష్‌తో పాటు శ్రీ రెడ్డిని కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఎప్పుడు వాళ్లకు ఛాన్స్ దొరికినా కూడా ఆడుకుంటారు. అయితే నేరుగా పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్లను పన్నెత్తి మాట అనలేదు. అప్పట్లో శ్రీ రెడ్డి మరీ ఎక్స్‌ట్రీమ్‌కు వెళ్లిపోయి పవన్ కళ్యాణ్ అమ్మను కూడా తిట్టడంతో ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఫిల్మ్ చాంబర్ వెళ్లి అక్కడ మెగా హీరోలంతా యాక్షన్ తీసుకోవాలంటూ ఛాంబర్ సభ్యులను కోరారు.

పవన్ కళ్యాణ్ Photo : Twitter
పవన్ కళ్యాణ్ Photo : Twitter


జనసేన పార్టీ పెట్టిన తర్వాత ప్రతీ సందర్భంలో పవన్ కళ్యాణ్‌ను తిడుతూనే ఉంది శ్రీ రెడ్డి. ఇప్పటికీ తన ఫేస్ బుక్ పేజీలో పవన్ గురించి విమర్శలు చేస్తూనే ఉంటుంది. వాళ్లందరి గురించి పట్టించుకుంటే పని చేసుకోలేను కదా.. అది వాళ్ల కుంచిత మనస్తత్వం అంటూ పవన్ లైట్ తీసుకున్నాడు. కానీ వాళ్ల గురించి పేరు చెప్పి మాత్రం తిట్టలేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కూడా పేరు చెప్పకుండా రివర్స్ కౌంటర్స్ వేసాడు పవర్ స్టార్. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు. తనను విమర్శించే వాళ్లకు కూడా కౌంటర్స్ వేసాడు పవర్ స్టార్. కొందరు తన తల్లిని దూషించారని.. అలా చేస్తే కోపం రాదా అని ప్రశ్నించాడు పవన్.

శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)
శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)


అదే పాత పవన్ అయ్యుంటే ఈ పాటికి వాళ్ల తాట తీసేవాన్ని అంటూ చెప్పుకొచ్చాడు పవన్. అప్పటి పద్దతులు లేవు కాబట్టే భరించానని చెప్పాడు జనసేనాని. అమ్మను తిట్టినపుడు కడుపు మండదా.. నా కోపాన్ని దాటాను కాబట్టే పొలిటికల్ పార్టీని పెట్టాను అంటూ చెప్పాడు ఈయన. ఎందుకంటే సమాజం తన కుటుంబం అనుకున్నాను కాబట్టే ఎవరు తిట్టినా.. తిట్టించినా పడ్డానని చెప్పాడు పవర్ స్టార్. ఎన్ని చేసినా కూడా ప్రజల కోసం తాను భరిస్తానని చెప్పాడు పవన్. మనకు కూడా టైమ్ వస్తుందని.. వచ్చినపుడు కూడా జనానికి సేవ చేయడమే తన ధ్యేయం అంటున్నాడు జనసేనాని.
Published by: Praveen Kumar Vadla
First published: March 15, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading