JANASENA CHIEF PAWAN KALYAN GIVEN RETURN COUNTER TO YSRCP LEADERS AND OPENS ABOUT HIS NAME PK
నా పేరు పవన్ కల్యాణ్ కాదు.. జనసేన అధ్యక్షుడి అసలు పేరేంటి..?
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
పవన్ కల్యాణ్, వైసీపీ మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే జనసేన అధ్యక్షుడిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. అసలు ఎవరు ఈ పవన్ కల్యాణ్ అంటూ ప్రశ్నించాడు..
పవన్ కల్యాణ్, వైసీపీ మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే జనసేన అధ్యక్షుడిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. అసలు ఎవరు ఈ పవన్ కల్యాణ్ అంటూ ప్రశ్నించాడు ఆయన. జగన్ రెడ్డి అని నువ్వు పిలిస్తే ఎంత.. పిలవకపోతే ఎంత అంటూ విమర్శించాడు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఎలా పిలవాలో నిర్ణయించుకున్నపుడు నువ్వెవరు మధ్యలో అంటూ ప్రశ్నించాడు ఈయన. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు.. సీఎం అనను జగన్ రెడ్డి అంటానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నాయకులు.
పవన్, జగన్, చంద్రబాబు
ఇక ఇదిలా ఉంటే తన పేరు విషయంలో పవన్ కూడా ఇప్పుడు జగన్ వర్గానికి చురకలంటించాడు. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్‌ను పవన్ నాయుడు అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ లీడర్స్. చంద్రబాబుకు నీడలా ఉన్నాడంటూ.. ఆయనేం చేస్తే ఈయన కూడా అదే చేస్తున్నాడని విమర్శిస్తూ పవన్ కల్యాణ్ కాస్తా పవన్ నాయుడుగా మార్చేసారు వైసీపీ నాయకులు. దాంతో తన పేరు విషయంలో వైసీపీ చేస్తున్న రచ్చకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసాడు పవన్.
పవన్ కల్యాణ్
తన అసలు పేరు పవన్ కల్యాణ్ కాదని.. కళ్యాణ్ కుమార్ అని చెప్పుకొచ్చాడు. అసలు తన తండ్రి తన పేరు చివర కులం పెట్టలేదని.. రెడ్డి, నాయుడు అంటూ ఏం లేదని చెప్పాడు. కళ్యాణ్ కుమార్ అంటూ పెట్టాడే కానీ చివర్లో ఏ తోక తగిలించలేదని వైసీపీ నాయకులకు చెప్పుకొచ్చాడు జనసేనాని. పవన్ నాయుడు అన్నంత మాత్రానా తనకు పోయేదేం లేదంటున్నాడు ఈయన. మొత్తానికి ఇప్పుడు వైసీపీ, పవన్ కల్యాణ్ మధ్య జగడం తారాస్థాయికి చేరిపోతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.