చిరు ఇంటికి పవన్... ఘనంగా మెగా ఫ్యామిలీ దీపావళి సంబరాలు

భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్‌, మార్క్ శంకర్ పవనోవిచ్‌, కూతురు ఆద్యతో కలిసి చిరు ఇంటికి వెళ్లారు పవన్ కల్యాణ్.

news18-telugu
Updated: October 28, 2019, 3:21 PM IST
చిరు ఇంటికి పవన్... ఘనంగా మెగా ఫ్యామిలీ దీపావళి సంబరాలు
చిరు ఇంట్లోనే పవన్ కల్యాణ్ దీపావళి సంబరాలు
  • Share this:
మెగా ఫ్యామిలీ ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ దీపావళి తన అన్న చిరంజీవి, నాగబాబులతో కలిసి సరదాగా జరపుకున్నారు. ఈ దీపావళి పండుగను తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి పవన్ సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్‌, మార్క్ శంకర్ పవనోవిచ్‌, కూతురు ఆద్యతో కలిసి చిరు ఇంటికి పవన్ వెళ్లారు. ఆదివారం అన్న ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తల్లి అంజనాదేవీతో కలిసి చిరు, సురేఖ, నాగబాబు అండ్ ఫ్యామిలీ, పవన్ అండ్ ఫ్యామిలీ జరుపుకున్న దీపావళి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా అభిమానులంతా తమ అభిమాన హీరోల్ని ఒకే దగ్గర చూసుకొని సంబర పడిపోతున్నారు.



First published: October 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...