అన్నయ్య లేకుంటే ఆరోజే ఆత్మహత్య చేసుకునేవాడిని: పవన్ కల్యాణ్

అన్నయ్య దగ్గరకు వచ్చినప్పుడు తాను కూడా అందరిలో ఓ అభిమానినే అన్నారు పవన్ కల్యాణ్.

news18-telugu
Updated: September 23, 2019, 11:27 AM IST
అన్నయ్య లేకుంటే ఆరోజే ఆత్మహత్య చేసుకునేవాడిని: పవన్ కల్యాణ్
చిరంజీవి, పవన్ కల్యాణ్
  • Share this:
సైరా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అన్న మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అన్నయ్య దగ్గరకు వచ్చినప్పుడు తాను కూడా అందరిలో ఓ అభిమానినే అన్నారు పవన్. బయట అభిమానులు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతారో నేను కూడా అన్నయ్య దగ్గరకు వెళ్లినప్పుడు అలాగే ఉంటానన్నారు. అందరూ బావుండాలని కోరుకొనే వ్యక్తి అన్న చిరంజీవి అంటూ కొనియాడారు. తనకు ఇవాళ స్టార్ డమ్ వచ్చిందంటే దానికి కారణం తన అన్న నేర్పిన పాఠాలే అన్నారు పవన్ కల్యాణ్.

సైరా ప్రి రిలీజ్‌ వేడుకలో చిరంజీవి, పవన్ కల్యాణ్


ఇంటర్ చదువుతున్న సమయంలో తాను ఎగ్జామ్‌లో ఫెయల్ అయ్యానన్నారు పవన్. ఆ సమయంలో మనసికంగా కుంగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పుకొచ్చారు. పిస్తోల్‌తో కాల్చుకొని చనిపోవాలనుకున్నాను. అలాంటి సమయంలో అన్న చిరంజీవి తనకు ఎంతో భరోసాను ఇచ్చారన్నారు. పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది ఫెయిల్యూర్ కాదని ... జీవితంలో గెలవాలని తనలో ధైర్యాన్ని నింపారన్నారు. ఆయన ఇచ్చిన గుండె బలం వల్లే... ఇవాళ మీ ముందు నిలబడగలిగారన్నారు. అన్నయ్యలా భరోసా ఇచ్చే వ్యక్తులు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో ఉంటుంటే.. అంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఉండేవారు కాదన్నారు పవన్ కల్యాణ్.First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>