వారికి నా సహకారం ఎపుడు ఉంటుందన్న పవన్ కళ్యాణ్..

రీసెంట్‌గా జనసేన కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్ కళ్యాణ్ ను ఇటీవల కలసి వారి కష్టాలను తెలుపుకున్నారు.అంతేకాదు వారికి హామి ఇచ్చారు.

news18-telugu
Updated: September 6, 2019, 10:11 AM IST
వారికి నా సహకారం ఎపుడు ఉంటుందన్న పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
  • Share this:
రీసెంట్‌గా జనసేన కార్యాలయంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్ కళ్యాణ్ ను ఇటీవల కలసి వారి కష్టాలను తెలుపుకున్నారు. సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్టులుగా, ఫైటర్లుగా,కాస్ట్యూమర్లగ ఇలా 24 రంగాలలోను సినీపరిశ్రమకు సేవలందిస్తున్న తమకు ఇళ్ళు దక్కటంలేదన్నారు.  అసలు చిత్ర పరిశ్రమతో సంబందం లేనివారు ఇళ్లను దక్కించుకుంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమకు పనిలేకుండా చేస్తున్నారంటూ తమకష్టాలను జనసేనానితో మొరపెట్టుకున్నారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ చిత్రపురిలో ఇళ్ళు దొరకని వారికి జనసేన పార్టీ అండగా నిలబడుతుందంటూ హామీ ఇచ్చారు. అందరికీ వినోదాన్ని పంచుతున్న సినీ పరిశ్రమకు సంభందించిన చిత్రపురి సాధన కమిటీలోనివారందరికీ ఇళ్ళు దొరికేంత వరకు తన గళాన్ని వినిపిస్తానని భరోసాఇచ్చారు.

‘పవన్ కళ్యాణ్’ (File/Photo)


ఈ విషయం పై తాను త్వరలో పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజ ,ఎన్. శంకర్ లతో మాట్లాడుతానని  భరోసా ఇచ్చారు. అంతేకాదు కాలనీలో వున్న వివిధ సమస్యలపై సామరస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.తెలుగుచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని . అందువల్ల చిత్రపురి లో తెలుగు సినీరంగ సభ్యుల సొంతింటి కల నెరవేరాలని తెలిపారు.
First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading