హోమ్ /వార్తలు /సినిమా /

Jamuna Passed Away: అలనాటి నటి జమున మృతిపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సంతాపం..

Jamuna Passed Away: అలనాటి నటి జమున మృతిపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సంతాపం..

జమున మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం (File/Photo)

జమున మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం (File/Photo)

Jamuna | తెలుగు సినీ ఇండస్ట్రీ తొలి తరం కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జమున. ఈమె మృతిపై తెలంగాణ, ఏపీ ముఖ్య మంత్రులు కేసీఆర్, వై.యస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Jamuna | తెలుగు సినీ ఇండస్ట్రీ తొలి తరం కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జమున. ఈ రోజు ఉదయం తన స్వగృహంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఈమె మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వయసు 86 యేళ్లు. ఈమె మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసారు. మాజీ ఎంపీగా సినీ, రాజకీయ ాల్లో తన వంతు ప్రజా సేవ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, కన్నడలో నటించిన విసయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

అటు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా జమున మృతిపై తన సంతాపాన్ని తెలియజేసారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం నటీమణుల్లో అగ్ర కథానాయికగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారి మృతి చెందడం బాధాకారం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా జమున గారి కుటంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

జమున మృతిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ''అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరస నటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అని అన్నారు.అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు జమున మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు జమున. తనదైన నటనతో వెండితెర సత్యభామగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Jamuna, Telangana

ఉత్తమ కథలు