Home /News /movies /

JAMES MOVIE REVIEW PK LATE PUNEETH RAJKUMAR AGAIN ROCK WITH ACTION AND EMOTION TA

James Movie Review : పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ రివ్యూ.. సెలబ్రేషన్ విత్ ఎమోషన్..

పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

కన్నడీగుల ఆరాధ్య నటుడు దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఈయన హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంతో యావత్ సినీ పరిశ్రమను కలిచి వేసింది. ఇక ఈయన హీరోగా నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాపై అభిమానులు, సామాన్య ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ‘జేమ్స్’ మూవీ అందుకుందా లేదా చూద్దాం.. 

ఇంకా చదవండి ...
రివ్యూ : జేమ్స్
నటీనటులు : పునీత్ రాజ్‌కుమార్,ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్ తదితరులు
సంగీతం : చరణ్ రాజ్
ఎడిటర్ : స్వామి జే గౌడ
సినిమాటోగ్రఫీ : దీపు ఎస్ కుమార్
నిర్మాత :  కిషోర్ పాతికొండ                                                                                                                    దర్శకుడు : చేతన్ కుమార్

కన్నడీగుల ఆరాధ్య నటుడు దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఈయన హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంతో యావత్ సినీ పరిశ్రమను కలిచి వేసింది. ఇక ఈయన హీరోగా నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాపై అభిమానులు, సామాన్య ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ‘జేమ్స్’ మూవీ అందుకుందా లేదా చూద్దాం..

కథ:
సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతుంటాడు. ఆయన విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) ప్రాణాలు కాపాడటానికి జె వింగ్స్ తరపున వస్తాడు. విజయ్ కు అతడి శత్రువు జోసెఫ్ ఆంటోనీ (శరత్ కుమార్) నుంచి ముప్పు ఉంటుంది. అప్పుడు జేమ్స్ ఏం చేసాడు.. అనేది అసలు కథ.. మధ్యలో డ్రగ్స్ మాఫియా ఎందుకు వస్తుంది.. దాన్ని జేమ్స్ ఎలా ఫేస్ చేసాడు..?

కథనం:

ఎలా ఉన్నాయో చూడాలనుకునే సినిమాలు కొన్ని.. ఎలా ఉన్నా.. చూడలనుకునే సినిమాలు ఇంకొన్ని. రెండో జాబితాలోకి వచ్చే సినిమా జేమ్స్.పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ కు.. ఈ సినిమా ఒక ఎమోషన్. సినిమాలో పునీత్ ఎనర్జీకి నిజంగా సలాం చెప్పాల్సిందే. మొదటి నుంచి చివరి వరకు.. డాన్స్ లో, ఫైట్ సీక్వెన్స్ లో ఆయనకు ఆయనే సాటి. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేడనే వార్తే నమ్మలేని చేదు నిజం. సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే కేవలం పునీత్ కోసం చూడొచ్చు. కథ ఎలా ఉన్నా.. స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా..స్క్రీన్ మీద పునీత్ రాజ్ కుమార్ కనిపించిన ప్రతిసారి ఏదో ఒక తెలియని ఎమోషన్. రొటీన్ కథను కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో స్పెషల్ గా మార్చేశాడు పవర్ స్టార్. మన దగ్గర ఏమో కానీ.. కర్ణాటకలో మాత్రం జేమ్స్ దెబ్బకు రికార్డులు బద్ధలే..అండర్ వరల్డ్ డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది కథ. దాన్ని ఒక ఆర్మీ ఆఫీసర్ ఎలా ఎదుర్కొన్నాడు అనే దాని చుట్టూ దర్శకుడు చేతన్ కుమార్ కథ అల్లుకున్నాడు. కొన్ని సన్నివేశాలు పునీత్ చనిపోయాక.. సీజి వర్క్ తో చిత్రీకరించారు. మధ్యలో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్.. అప్పు చివరి సినిమాలో అతిథి పాత్రల్లో మెరిసారు. యాక్షన్ సీక్వెన్సుల విషయంలో జేమ్స్ టాప్ నాచ్ లో ఉంది. పునీత్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్లస్ పాయింట్స్.. 

పునీత్ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్..

యాక్షన్ సీన్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్..

మైనస్ పాయింట్స్ 

రొటీన్ కథ

అక్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలు..

చివరి మాట : ఓవరాల్ గా జేమ్స్.. అప్పు ఫ్యాన్స్ కు సెలబ్రేషన్ విత్ ఎమోషన్..

దివంగత కర్నాటక రత్న పురస్కార గ్రహీత పునీత్ రాజ్ కుమార్ పై గౌరవంతో ‘జేమ్స్’ మూవీకి రేటింగ్ ఇవ్వడం లేదు..
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: James Movie, Kollywood, Puneeth RajKumar, Tollywood

తదుపరి వార్తలు