Home /News /movies /

JAMES CAMERON SAYS HE MAY NOT DIRECT AVATAR 4 AND 5 SB

Avatar: అవతార్ నుంచి తప్పుకుంటున్నా.. జేమ్స్ కామెరాన్ సంచలన నిర్ణయం

అవతార్ 2 ట్రైలర్ రిలీజ్

అవతార్ 2 ట్రైలర్ రిలీజ్

ఓ కొత్త ప్రాజెక్టు కోసం పని చేయాలనుకుంటున్నా. దీని కోసం 'అవతార్‌'లో నా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అంటూ జేమ్స్ కామెరూన్ స్వయంగా ప్రకటించారు.

    హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన  ఓ అద్భుతం ‘అవతార్‌’.  ఈ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా సరే..అందులోని వింతల్ని, కొత్త ప్రపంచాల్ని మరిచిపోలేరు.  2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక కొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఇలాంటి లోకం కూడా ఒకటి ఉంటుందా అనే విధంగా జేమ్స్ కామెరాన్.. విజువల్స్‌తో వండర్ చేశాడు.

    ఇప్పటికీ అవతార్ బాక్సాఫీస్ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉందంటే అది ఏ స్థాయి విజయమో అంచనా వేయొచ్చు. చాలాచోట్ల అవతార్ సృష్టించిన రికార్డుల్ని అవెంజర్స్- ఎండ్ గేమ్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. అవతార్ సిరీస్ నుంచి వరుసగా సీక్వెల్స్ విడుదల కానున్నాయి. వాటి డేట్స్ కూడా కామెరూన్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అవతార్ 2 సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. అవతార్ సినిమాలో కామెరూన్ పండోరా గ్రహాన్ని చూపించిన తీరు, కథ, కథనం అన్నీ కట్టిపడేసేలా ఉంటాయి. అయితే అలాంటి జేమ్స్‌ కామెరూన్‌ 'అవతార్‌' డైరక్షన్‌ నుండి తప్పుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. 'అవతార్‌ 2', 'అవతార్‌ 3' చేశాక ఈ సిరీస్‌ను వదిలేస్తారట.

    రెండు, మూడు భాగాలు అయిపోయాక తర్వాత వేరే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అని కామెరూన్‌ చెప్పారు. 'అవతార్‌' రెండో భాగం 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ''ఓ కొత్త ప్రాజెక్టు కోసం పని చేయాలనుకుంటున్నా. దీని కోసం 'అవతార్‌'లో నా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. 'అవతార్‌' నాలుగు, ఐదో భాగాల దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి ఇచ్చేస్తాను'' అని చెప్పారు కామెరూన్‌. 'అవతార్‌' నాకెంతో ఇష్టమైన వాతావరణం, ప్రకృతి. దీన్ని నేను కుటుంబంతోనే పోలుస్తాను. అనేక అంశాలపై నా అభిప్రాయం చెప్పడానికి గొంతునిచ్చిన సినిమా ఇది. 'అవతార్‌' నాకు నిజ జీవితంలోనూ వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకం అని కామెరూన్‌ చెప్పారు.

    'అవతార్‌'కి ఒక సీక్వెల్‌ కాదు నాలుగు సీక్వెల్స్‌ ఉంటాయని జేమ్స్‌ కామెరూన్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు వస్తున్న 'అవతార్‌ 2' కోసం జేమ్స్‌ 2017 నుండి పని చేస్తున్నారు. ఇక మిగిలిన మూడు సీక్వెల్స్‌ ఎప్పుడొస్తాయి అన్నదీ ముందే చెప్పేశారు. మొత్తంగా 2028లోపు ఆ సీక్వెల్స్‌ తెచ్చేయాలనేది ఆలోచనట. ప్రతి సీక్వెల్‌ డిసెంబరులోనే ఉంటుంది. 'అవతార్‌ 3'ని 2024 డిసెంబరు 20న తెస్తారు. నాలుగో 'అవతార్‌' డిసెంబరు 18, 2026లో వస్తుందట. ఇక ఆఖరిదైన 'అవతార్‌ 5'ను 22 డిసెంబరు 2028లో విడుదల చేస్తారట.'అవతార్‌ 2' డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో విడుదల చేస్తారని టాక్‌. ఓ సినిమా ఇన్ని భాషల్లో విడుదలవ్వడం ఇదే తొలిసారి అంటున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు