హాలీవుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ సినిమాను సినీ ప్రియులెవరూ మరిచిపోలేరు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ 'అవతార్'కు సీక్వెల్‌గా వస్తున్న మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water ). ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా టీమ్ ఇప్పటికే ఓ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణ పొందింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా ఎవరు ఊహించనంత నిడివి.. ఉండనుంది. ఈ సినిమా 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక విడుదల తేదీ సమీపించడంతో తాజాగా మరో ట్రైలర్‌ను (Avatar: The Way of Water Trailer) విడుదల చేసింది టీమ్. ఈ సరికొత్త ట్రైలర్ కూడా అదిరిపోయింది. విజువల్ వండర్ అని చెప్పోచ్చు. గత ట్రైలర్లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్’ను చూపించగా ఈసారి మాత్రం మరింత స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన సీన్స్‌ను చూపించారు. ఈ సరికొత్త ట్రైలర్లో తమ తెగని కాపాడుకునే క్రమంలో చూపించిన యుద్ధ సన్నివేశాలు వావ్ అనిపిస్తున్నాయి.
#AvatarTheWayOfWater : Runtime 192.10 (3 Hours 12 Minutes 10 Seconds) Censored on 8th Nov 2022 India. Releasing on 16th December All Over India. #Avatar #Avatar2 pic.twitter.com/Gc7CMdk7Jx
— Suresh Kondi (@SureshKondi_) December 9, 2022
భారీ సెట్టింగులు, ఫైట్స్, యాక్షన్ ఇలా అదిరిపోయింది. మరొక్కసారి పండోరాకు తీసుకువెళ్లారు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ప్రతీ సన్నివేశం అదిరిపోయింది. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, గ్రాఫిక్స్ ఇలా ఒకటి ఏమిటీ అంతా అదుర్సే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా (Avatar: The Way of Water) ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
On December 16, experience the motion picture event of a generation.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/UitjdL3kXr — Avatar (@officialavatar) November 22, 2022
అందులో భాగంగా తాజాగా అవతార్ సినిమా రీజనల్ లాంగ్వేజ్ కు భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్ కు 120 కోట్లు వరకు రేటు పలికినట్లు సమాచారం. సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో వంద కోట్లుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.చూడాలి మరి ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో.. ఇక అవతార్ 1 విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 1994లో రాయడం మొదలు పెట్టి షూటింగ్ పూర్తయ్యేవరకు 15 యేళ్లకు పైగా సమయం పట్టింది. దాదాపు 237 మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే 3 బిలియన్ యూఎస్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. అవతార్ సిరీస్ నుంచి వరుసగా సీక్వెల్స్ విడుదల కానున్నాయి. వాటి డేట్స్ కూడా కామెరూన్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. ఏకంగా 160 భాషల్లో ఈ సినిమా విడుదల అవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదే రికార్డ్ కానుంది. ‘అవతార్’ సినిమాను సంబంధించిన సీక్వెల్స్‌ను డిస్నీ సంస్థ నిర్మిస్తోంది. అవతార్ 3 సీక్వెల్‌ను కూడా 20 డిసెంబర్ 2024లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 2026 డిసెంబర్ 18 ‘అవతార్ 4’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ‘అవతార్ 5’ సినిమాను 22 డిసెంబర్ 2028 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా వరుసగా ఐదు సీక్వెల్స్‌ను ప్రకటించడమే కాదు. వాటికి సంబంధించిన రిలీజ్ డేట్స్ ను కూడా ప్రకటించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Avatar, Tollywood news