జేమ్స్ బాండ్ 25వ చిత్రం ట్రైలర్ విడుదల.. యాక్షన్‌తో అదరగొట్టాడుగా..

‘నో టైమ్ టూ డై’ జేమ్స్ బాండ్ మూవీ ట్రైలర్ విడుదల (Instagram/Photo)

ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’ సినిమా తెరకెక్కింది. డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తోన్న 5వ సినిమా. జనరల్ గా సీక్వెల్స్ అంటే 5 లేదా 6కు మించి తీయడం అసాధ్యం. తీసినా చూడ్డానికి బోర్ కొడుతుంది. అలాంటిది.. జేమ్స్ బాండ్ సిరిస్‌లో 24 సీక్వెల్స్ రావడం అంటే మాటలు కాదు. అంతేనా ఒక కేరెక్టర్ 56 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అలరించడం నాటే జోక్. అలాంటి అరుదైన ఘనత సాధించాయి జేమ్స్ బాండ్ సినిమాలు.ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు. తాజాగా ఈ  సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. జేమ్స్ బాండ్ చిత్రాల్లో ఏ సినిమాకు  ఈ మూవీ దర్శకుడికి, హీరోకు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌ల కారణంగా ఈ మూవీ నుంచి దర్శకుడు డేని బాయ్‌లే పక్కకు తప్పుకున్నాడు. ఆయన ప్లేస్‌లో కారీజోజి పుకునాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.    ఈ ట్రైలర్ చూస్తుంటే.. కిడ్నాప్‌కు గురైన ఓ సైంటిస్ట్‌ను కాపాడేందుకు మళ్లీ జేమ్స్‌బాండ్‌ను ఉద్యోగంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత జరిగినే సంఘటనే ఈ సినిమా స్టోరీ అని ఈ ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. ఈ సినిమాను 3 ఏప్రిల్  2020న యూకేలో , 8 ఏప్రిల్ 2020న యూఎస్‌‌తో పాటు మన దేశంలో విడుదల కానుంది. ఈ సినిమాను మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: