హోమ్ /వార్తలు /సినిమా /

No time to Die: జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘నో టైమ్ టూ డై’ కొత్త ట్రైలర్ విడుదల..

No time to Die: జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘నో టైమ్ టూ డై’ కొత్త ట్రైలర్ విడుదల..

No time to Die Trailer Released | ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో25వ చిత్రం ‘నో టైమ్ డై’ తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

  ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో జేమ్స్‌బాండ్ మూవీస్ ముందు వరసలో వుంటాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. ఇపుడీ సిరీస్‌లో 25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’ సినిమా తెరకెక్కింది. డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తోన్న 5వ సినిమా. జనరల్ గా సీక్వెల్స్ అంటే 5 లేదా 6కు మించి తీయడం అసాధ్యం. తీసినా చూడ్డానికి బోర్ కొడుతుంది. అలాంటిది.. జేమ్స్ బాండ్ సిరిస్‌లో 24 సీక్వెల్స్ రావడం అంటే మాటలు కాదు. అంతేనా ఒక కేరెక్టర్ 56 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అలరించడం నాటే జోక్. అలాంటి అరుదైన ఘనత సాధించాయి జేమ్స్ బాండ్ సినిమాలు.ఈ సిరీస్ తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు.ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ట్రైలర్ విడుద‌లై మంచి స్పందనను దక్కించుకుంది. తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

  ఈ లేటేస్ట్ చిత్రానికి క్యారీ జోజీ దర్శకత్వం వహించాడు. 'నో టైమ్ టు డై' సినిమాను తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించారు. ఇక ఈ సినిమా సమ్మర్‌లో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది.  'నో టైమ్ టు డై' సినిమా నిర్మాణానికి 200 మిలియ‌న్ పౌండ్లు(దాదాపు 1837 కోట్ల రూపాయ‌లు) ఖ‌ర్చ‌ు అయ్యిందట. ఇక ఈ సినిమా క‌థ విష‌యానికొస్తే సీఐఏ సంస్థ జేమ్స్ బాండ్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది. అయితే ఆ మిషన్‌‌ను పూర్తి చేసే క్రమంలో విల‌న్లు అడుగుడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. దాన్ని బాండ్ ఎలా ఎదుర్కొన్నార‌నేది కథ. అన్ని అనుకూలిస్తే నో టైమ్ టు డై నవంబర్‌లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

  First published:

  Tags: Hollywood

  ఉత్తమ కథలు