హోమ్ /వార్తలు /సినిమా /

Tanya Roberts Passes Away: జేమ్స్ బాండ్ హీరోయిన్ తాన్య రాబర్డ్స్ కన్నుమూత..

Tanya Roberts Passes Away: జేమ్స్ బాండ్ హీరోయిన్ తాన్య రాబర్డ్స్ కన్నుమూత..

తాన్య రాబర్ట్స్ కన్నుమూత (File/Photo)

తాన్య రాబర్ట్స్ కన్నుమూత (File/Photo)

Tanya Roberts Passes Away:  జేమ్స్ బాండ్ హీరోయిన్ హాలీవుడ్ కథానాయిక  తాన్య రాబర్డ్స్ కన్నుమూసారు.


  Tanya Roberts Passes Away:  జేమ్స్ బాండ్ హీరోయిన్ హాలీవుడ్ కథానాయిక  తాన్య రాబర్డ్స్ కన్నుమూసారు. ఆమె సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నమూసినట్టు హాస్పిటల్ వర్గలు తెలిపాయి. ఐతే.. ఆదివారం రోజు హాస్పిటల్‌లో ఆమె  ముందుగా చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. ఆ తర్వాత ఆమె బతికే ఉందని కుటుంబ సభ్యులకు తెలిపి చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం వికటించడంతో సోమవారం రాత్రి ఆమె కన్నుమూసినట్టు వైద్యులు కన్ఫామ్ చేసారు. తాన్య .. గత నెల డిసెంబర్ 24న తన పెంపుడు కుక్కలతో కాలిఫోర్నియాలోని తన నివాసం నుంచి  వాకింగ్ బయలు దేరింది. ఇంతలో ఏమైందో ఏమో ఆకస్మాత్తుగా ఆమె కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో తాన్యకుమిగతా టెస్టులతో పాటు కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడ ఆమెకు నెగిటివ్ రిపొర్ట్ వచ్చింది.


  తాన్య రాబర్ట్స్ విషయానికొస్తే..  అమెరిన్ నటిగా.. మోడల్‌గా, నిర్మాతగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది.మోడలింగ్‌లో పాపులర్ అయ్యాక.. టీవీ, నాటక రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించింది తాన్య. ముఖ్యంగా 1970లో అమెరికాలో ప్రసారమైన చార్లీస్ ఏంజెల్స్ సీరియల్‌తో ఈమె పాపులర్ అయింది.దాంతో పాటు ‘బీస్ట్ మాస్టర్’, షీనా క్వీన్ ఆప్ జంగిల్’ వంటివి తాన్యకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

  James Bond Heroine Tanya Roberts Passes Away at 65 Years,Tanya Roberts Passes Away: జేమ్స్ బాండ్ హీరోయిన్ తాన్య రాబర్డ్స్ కన్నుమూత..,Tanya Roberts Passes Away,Tanya Roberts died,Tanya Roberts Passes Away dies at 65,James Bond Heroine Tanya Roberts Passes Away,Tanya Roberts movies,Tanya Roberts No More, Hollywood,తాన్య రాబర్డ్స్,తాన్య రాబర్ట్స్ కన్నుమూత,జేమ్స్ బాండ్ హీరోయిన్ కన్నుమూత,తాన్య రాబర్డ్స్ కన్నమూత
  జేమ్స్ బాండ్ మూవీ ‘ఏ వ్యూ టూ కిల్’ సినిమాలో రోజర్ మూర్‌తో తాన్య రాబర్ట్స్ (File/Photo)

  1985లో  రోజర్ మూర్ జేమ్స్ బాండ్‌గా నటించిన ‘ఏ వ్యూ టూ కిల్’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆమె మృతికి హాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hollywood

  ఉత్తమ కథలు