జేమ్స్ బాండ్ షూటింగ్ స్పాట్‌లో పేలుడు.. షూటింగ్‌కు బ్రేక్..

అతడు చేసే అడ్వెంచర్లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. రహస్యాలను ఛేదించడంలో అతడికతడే సాటి. ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడంటే ఆడియన్స్‌లో నరాలు తెగే ఉత్కంఠ.తాజాగా ఈ సినిమా షూటింగ్ బ్రిటన్‌లోని ప్రఖ్యాత పైన్‌వుడ్ స్టూడియోలో జరగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా సెట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా పేలుడు సంభవించింది.

news18-telugu
Updated: June 5, 2019, 3:34 PM IST
జేమ్స్ బాండ్ షూటింగ్ స్పాట్‌లో పేలుడు.. షూటింగ్‌కు బ్రేక్..
జేమ్స్ బాండ్ 25వ మూవీ
  • Share this:
అతడు చేసే అడ్వెంచర్లకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. రహస్యాలను ఛేదించడంలో అతడికతడే సాటి. ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడంటే ఆడియన్స్‌లో నరాలు తెగే ఉత్కంఠ.అతడే బాండ్..జేమ్స్ బాండ్. 007గా ఇంకా ఫేమస్.జనరల్ గా సీక్వెల్స్ అంటే 5 లేదా 6కు మించి తీయడం అసాధ్యం. తీసినా చూడ్డానికి బోర్ కొడుతుంది. అలాంటిది.. జేమ్స్ బాండ్ సిరిస్‌లో 24 సీక్వెల్స్ రావడం అంటే మాటలు కాదు. అంతేనా  ఒక కేరెక్టర్ 55 ఏళ్లు గా ప్రపంచ ప్రేక్షకులను అలరించడం నాటే జోక్. అలాంటి అరుదైన ఘనత సాధించాయి జేమ్స్ బాండ్ సినిమాలు.ఈ యేడాది చివర్లో బాండ్ సిరీస్‌లో 25వ సినిమా రాబోతుంది. హీరోగా డేనియల్ క్రేగ్‌కు ఇది చివరి చిత్రం. ఇప్పటి వరకు క్రేగ్ నాలుగు చిత్రాల్లో బాండ్‌గా నటించాడు. ఇపుడు నటిస్తున్న సినిమా ఐదోది. ఆ తర్వాత వచ్చే బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా ఎవరు నటిస్తారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ బ్రిటన్‌లోని ప్రఖ్యాత పైన్‌వుడ్ స్టూడియోలో జరగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా సెట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా పేలుడు సంభవించింది.
జేమ్స్ బాండ్ 007


తాజాగా ఈ సినిమా షూటింగ్ బ్రిటన్‌లోని ప్రఖ్యాత పైన్‌వుడ్ స్టూడియోలో జరగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా సెట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా పేలుడు సంభవించింది. అది కూడా ఒకటికి మూడు సార్లు పేలుడు సంభవించిదని సమాచారం. దాంతో సెట్‌లో పై కప్పు, గోడలు కూలిపోయాయి. ఈ ఘటనలో సెట్ బయట ఉన్న వ్యక్తికి స్వల్పంగా గాయలైనట్టు సమాచారం.

తాజాగా ఈ సినిమా షూటింగ్ బ్రిటన్‌లోని ప్రఖ్యాత పైన్‌వుడ్ స్టూడియోలో జరగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా సెట్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా పేలుడు సంభవించింది.
జేమ్స్ బాండ్ పాత్రధారి డేనియల్ క్రేగ్


ఇక జేమ్స్ బాండ్ సిరీస్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. మొదట ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా గాయాలపాలైయ్యాడు. దాంతో ఆయన కాలికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో  ఈ సినిమా షూటింగ్ కాస్తంత ఆలస్యమైంది. తాజాగా కేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
First published: June 5, 2019, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading