అర్జున్ కపూర్ ‘పానిపత్’ మూవీపై వివాదం.. రాజస్థాన్‌లో ప్రదర్శన నిలిపివేత..

ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో మేటర్ ఏమైనా ఉంటుందో లేదో  కానీ.. వివాదాలు మాత్రం బాగానే వుంటున్నాయి. తాజాగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘పానిపత్’ సినిమాపై రాజస్థాన్‌లో వివాదం రాజుకుంది.

news18-telugu
Updated: December 10, 2019, 7:54 AM IST
అర్జున్ కపూర్ ‘పానిపత్’ మూవీపై వివాదం.. రాజస్థాన్‌లో ప్రదర్శన నిలిపివేత..
‘పానిపత్’ మూవీపై వివాదం (News18/English)
  • Share this:
ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో మేటర్ ఏమైనా ఉంటుందో లేదో  కానీ.. వివాదాలు మాత్రం బాగానే వుంటున్నాయి. తాజాగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో సంజయ్ దత్, అర్జున్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘పానిపత్’ సినిమాపై రాజస్థాన్‌లో వివాదం రాజుకుంది. ఈ సినిమా జాట్ వర్గీయులను అవమానించే విధంగా ఉందని ఆ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ చిత్రాన్ని వెంటనే నిషేధించాలని రాజస్థాన్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోరుతున్నారు. అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ చిత్రం మూడో పానిపత్ యుద్ధాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాలు అర్జున్ కపూర్.. మరాఠా పీష్వా సదాశివరావ్‌గా ఆయన పార్వతీ భాయ్‌గా కృతిసనన్ నటించింది.  ఈ సినిమాలో అఫ్గానిస్థాన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఐతే.. ఈ చిత్రంలో జాట్ మహారాజు సూరజ్ మాల్ పాత్రను తప్పుగా చిత్రీకరించారని.. వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో జాట్‌లు నిరసనలు చేపట్టారు. అంతేకాదు ఈ చిత్ర దర్శకుడైన అశుతోష్ గోవారికర్ దిష్టిబొమ్మలను సైతం తగలబెట్టారు.

Jaipur Theatres Stop Screening Panipat After Protests Against Bharatpur King's Portrayal in Film,panipat,panipat movie,panipat trailer,panipat trailer reaction,panipat movie trailer,panipat screening,panipat reaction,panipat movie song,panipat teaser,panipat kriti sanon,panipat sanjay dutt,panipat arjun kapoor,#panipat,panipat official trailer,panipat song,panipat songs,bala screening,jhanvi kapoor at bala screening,special screening,panipat review,tahira kashyap at bala screening,panipat movie review,arjun kapoor,ashutosh gowariker,ashutosh gowarikar,ashutosh gowariker panipat,ashutosh gowariker movies,ashutosh gowariker interview,ashutosh gowariker family,ashutosh gowariker new movie,ashutosh gowariker family pics,ashutosh gowariker family video,ashutosh gowariker family photos,ashutosh,movies of ashutosh gowarikar,ashutosh gowariker wife,ashutosh gowariker film,sunita gowariker,lagaan ashutosh gowariker,arjun kapoor,bollywood,hindi cinema,పానిపత్,పానిపత్ సినిమా వివాదం,పానిపత్ యుద్ధం,అర్జున్ కపూర్,సంజయ్ దత్,కృతి సనన్,మూడో పానిపట్టు యుద్దం,అశుతోష్ గోవారికర్
‘పానిపత్’ మూవీలో అర్జున్ కపూర్ (News18/English)


ఈ సందర్భంగా రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసారు. ‘పానిపత్’ యుధ్దంలో భరత్‌పుర్ ప్రాంతానికి చెందిన మహారాజు సూరజ్‌మాల్ క్యారెక్టర్‌ను అభ్యంతరకరంగా చూపించడం చాలా బాధకరమైన విషయం. ఇప్పటికే రాజస్థాన్‌తో పాటు హర్యాణ, ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వేంద్ర సింగ్  మాట్లాడుతూ.. మహారాజా సూరజ్ మాల్ కుటుంబంలో 14 వ తరానికి చెందిన వ్యక్తిని నేను. యుద్ధంలో పీష్వా ఓడిపోయాక వాళ్ల సైన్యం తీవ్రగాయాలతో పానిపత్ నుంచి తిరిగి వచ్చాయి. ఆ సమయంలో మహారాజా సూరజ్ మాల్ , మహారాణి కిషోరి..వారికి కొన్ని నెలల పాటు రక్షణ ఏర్పాట్లు చేసారన్నారు. ఏదైనా ఇటువంటి చారిత్రక సినిమాలను తెరకెక్కించేటపుడు సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోనే విధంగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని సిఫార్స్ చేస్తున్నామన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 10, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading