హోమ్ /వార్తలు /సినిమా /

Jai Bhim Trailer Talk : సూర్య ‘జై భీమ్’ ట్రైలర్ టాక్.. న్యాయం కోసం పోరాడే వకీల్ సాబ్..

Jai Bhim Trailer Talk : సూర్య ‘జై భీమ్’ ట్రైలర్ టాక్.. న్యాయం కోసం పోరాడే వకీల్ సాబ్..

విడుదలైన మరుక్షణం నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరు సూర్య చేసిన ప్రయత్నానికి సలాం చెప్తున్నారు. స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు. కొన్నేళ్ళ కింది వరకు వరస ఫ్లాపులతో విమర్శల పాలైన సూర్య.. ఇప్పుడు తనను తాను కొత్తగా మార్చుకున్నాడు. ఓటిటికి సరిపోయే సబ్జెక్టులు తీసుకుని అద్భుతాలు చేస్తున్నాడు.

విడుదలైన మరుక్షణం నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరు సూర్య చేసిన ప్రయత్నానికి సలాం చెప్తున్నారు. స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు. కొన్నేళ్ళ కింది వరకు వరస ఫ్లాపులతో విమర్శల పాలైన సూర్య.. ఇప్పుడు తనను తాను కొత్తగా మార్చుకున్నాడు. ఓటిటికి సరిపోయే సబ్జెక్టులు తీసుకుని అద్భుతాలు చేస్తున్నాడు.

Suriya - Jai Bhim Trailer Talk తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. తాజాగా ఈయన ‘జై భీమ్’ అనే సినిమా చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

  Suriya - Jai Bhim Trailer Talk తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘గజని’తో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో బ్లాక్ బస్టర్ (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

  అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గత సంవత్సరం నవంబ‌ర్ 12న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌ల‌తో డీలా ప‌డ్డ సూర్య‌కు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

  Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

  క‌థ మొద‌లు ప్ర‌ధాన పాత్రాధారుల న‌ట‌న‌, స్క్రీన్ ప్లే, సుధా కొంక‌ర ద‌ర్శ‌క‌త్వం, జీవీ ప్ర‌కాష్ సంగీతం, నిర్మాణ విలువ‌లు అన్నీ ఈ సినిమాకు ప్ల‌స్‌గా మారాయి. అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ 'ఐఎండీబీ'లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా రికార్డ్‌ నెలకొల్పింది. 'ఆకాశం నీ హ‌ద్దురా'లో సూర్య‌కు జంటగా అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించ‌గా ఇతర ముఖ్య పాత్రల్లో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి నటించారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మించారు.

  ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పనున్నారా.. ?

  ఇక అది అలా ఉంటే సూర్య నటిస్తున్న మరో సినిమా జై భీమ్ (Jai Bhim). జై భీమ్.. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అణగారిన, పేదల కోసం పాటుపడే లాయర్ పాత్రలో సూర్య ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా సూర్య గత చిత్రం ఆకాశం నీ హద్దురా మాదిరిగానే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

  1995లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎక్కడో అడవుల్లో సరైన గుర్తింపు లేని అణిగారిన వర్గాల ప్రజలను  పోలీసులు అన్యాయంగా ఓ కేసులో ఇరకిస్తారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని వారి తరుపున హీరో సూర్య వాదించి వారిని ఎలా న్యాయం చేసారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో డిఫెన్స్ లాయర్ పాత్రలో రావు రమేష్ అద్భుత నటన కనబరిచారు.

  MLA Roja Daughter : ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలిక తెరంగేట్రానికి అంతా సిద్దమైందా.. ?

  ఈ సినిమా దీపావళీ సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ప్రైమ్ వీడియో తాజాగా ఓ ప్రకటన చేసింది.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక దంపతులు నిర్మించారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళంలో సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Amazon prime, Jai Bhim Movie, Kollywood, Suriya, Tollywood

  ఉత్తమ కథలు