‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 1970-80 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో ..
బాహుబలి వంటి సూపర్ సక్సెస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాతో సందడి చేసాడు. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓవరాల్‌గా మంచి కలెక్షన్సే రాబట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 1970-80 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘సాహో’ తర్వాత ప్రభాస్..పారిస్‌లోనే తన వెకేషన్ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ .. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు నటించబోతున్నట్టు సమాచారం.
ప్రభాస్,జగపతిబాబు (File Photos)
త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు. ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.