భలే ఛాన్సులే.. హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జగపతి బాబు..
news18-telugu
Updated: June 25, 2019, 6:28 PM IST

జగపతిబాబు ఫైల్ ఫోటో
- News18 Telugu
- Last Updated: June 25, 2019, 6:28 PM IST
గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన ‘అవెంజర్స్’ సినిమా హిందీతో పాటు తెలుగులో ఏ రేంజ్లో దుమ్ము దులిపిందో తెలిసిందే కదా. తాజాగా అదే రూట్లో ‘ది లయన్ కింగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేషన్‌గా వచ్చిన డిస్నీ కామిక్..అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతూ..మనలాగే ప్రవర్తిస్తాయి. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి. కలిసి మెలిసి బతుకుతాయి. వీటికి ఓ రాజు, ఓ రాణి, ఓ యువరాజు ఉంటారు. అంతేకాదు జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అయితే ఇదంతా డిస్నీ తయారు చేసిన ఓ కల్పిత కథ. దీని పేరే 'ది లయన్ కింగ్'.

ఈ లయన్ కింగ్ సినిమాలో హీరో 'సింబ'. చిన్నప్పుడే సింబ ఓ యాక్సిడెంట్ కారణంగా.. కుటుంబం నుండి పారిపోతాడు. తన కుంటుంబానికి దూరంగా.. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పందితో కలిసి జీవిస్తూ ఉంటాడు.
అయితే కొన్ని యేళ్ల తర్వాత తన గతం గుర్తుకురావడం..తర్వాత తన రాజ్యాన్ని ఎలా తిరిగి దక్కించుకున్నాడనేది కథ. అయితే 1990లో ఈ సినిమాను 2డి యానిమేటెడ్ సినిమాగా విడుదల చేశారు. ఈ సినిమాను కూడా జంగిల్ బుక్ సినిమాను తెరకెక్కించన జాన్ ఫెరో ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.

మరోసారి..ఆధునిక సాంకేతిక సహాయంతో 3డిలో వచ్చే నెల జూలై 19న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు షారుక్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాలోని ముఫాసా (సింబా తండ్రి) క్యారెక్టర్‌కు షారుక్ డబ్బింగ్ చెబుతుండగా..ఈ సినిమాకు హీరో సింబా క్యారెక్టర్‌కు షారుక్ తనయుుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. తెలుగులో ముసాఫాకు పి.రవిశంకర్ డబ్బింగ్ చెబుతుండగా.. హీరో సింబా (స్కార్)కు జగపతిబాబు డబ్బింగ్ చెబుతున్నాడు. 
ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్‌కు బ్రహ్మానందం, ఆలీ వంటి కమెడియన్స్ డబ్బింగ్ చెబుతుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తానికి జగపతి బాబు, రవిశంకర్ గొంతులు ఈ సినిమాకు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

The Lion King పోస్టర్స్ Photo: Twitter.com/disneylionking
ఈ లయన్ కింగ్ సినిమాలో హీరో 'సింబ'. చిన్నప్పుడే సింబ ఓ యాక్సిడెంట్ కారణంగా.. కుటుంబం నుండి పారిపోతాడు. తన కుంటుంబానికి దూరంగా.. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పందితో కలిసి జీవిస్తూ ఉంటాడు.
జేమ్స్ బాండ్ 25వ చిత్రం ట్రైలర్ విడుదల.. యాక్షన్‌తో అదరగొట్టాడుగా..
నటుడు ఆత్మహత్య.. విషాదంలో ఇండస్ట్రీ.. ఏడాదిలో 6వ యాక్టర్..
హీరోయిన్‌పై అత్యాచారం.. పోలీసుల కస్టడీలో ఆ బుల్లితెర నటుడు..
నగ్నంగా నటించేలా చేసాడు.. దర్శకుడిపై హీరోయిన్ కామెంట్స్..
బెడ్రూమ్లో భర్త నిక్ జోనస్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..
షూటింగ్ సెట్లో కిందపడి నటుడి మృతి..

ముసాఫా పాత్రకు పి.రవి శంకర్ డబ్బింగ్
మరోసారి..ఆధునిక సాంకేతిక సహాయంతో 3డిలో వచ్చే నెల జూలై 19న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు షారుక్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాలోని ముఫాసా (సింబా తండ్రి) క్యారెక్టర్‌కు షారుక్ డబ్బింగ్ చెబుతుండగా..ఈ సినిమాకు హీరో సింబా క్యారెక్టర్‌కు షారుక్ తనయుుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. తెలుగులో ముసాఫాకు పి.రవిశంకర్ డబ్బింగ్ చెబుతుండగా.. హీరో సింబా (స్కార్)కు జగపతిబాబు డబ్బింగ్ చెబుతున్నాడు.
Loading...

ది లయన్ కింగ్‌లో సింబాకు డబ్బింగ్ చెబుతున్న జగపతి బాబు