• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JAGAPATI BABU TO ACCEPT ANOTHER CRAZY PROJECT IN TOLLYWOOD TA

మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన జగ్గూ భాయి..

మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన జగ్గూ భాయి..

జగపతి బాబు (File/Photo)

జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్నాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే... క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రఫ్పాడించేస్తున్నాడు. తాజాగా జగపతిబాబు మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్నాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే... క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రఫ్పాడించేస్తున్నాడు. గత  ఐదారేళ్లుగా వివిధ భాషల్లో రకరకాల క్యారెక్టర్స్‌తో మెప్పించిన జగపతిబాబు.. ఈ మధ్యనే కాస్తా స్లో అయ్యాడు. తాజాగా జగపతి బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో  ముఖ్యపాత్రలో నటించబోతున్నాడు. అది కూడా పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను టీడీపీ ఎంపీ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గల్లా అశోక్ సరసన ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు నుంచి సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టారు.

    jagapati babu to accept another crazy project in tollywood,jagapathi babu,jagapati babu,galla ashok,jagapati babu galla ashok,jagapati babu get less offers,jagapati babu twitter,jagapati babu instagram,jagapati babu facebook,jagapati babu movies,jagapathi babu movies,actor jagapathi babu,jagapathi babu interview,jagapathi babu songs,jagapathi babu tnr,jagapati babu action scenes,jagapati babu comedy scenes,jagapathi babu video songs,actor jagapathi babu latest,jagapati babu hindi dubbed movies,jagapathi babu tnr interview,actor jagapathi babu interview,jagapathi babu idream interview,jagapati babu tanhaji,jagapati babu ajay devgn,tollywood,bollywood,sandalwood,kollywood,mallwood,జగపతిబాబు,జగపతి బాబు,జగపతి బాబు సినిమాలు,ఆఫర్లు తగ్గిన జగపతి బాబు,జగపతిబాబు విలన్ ఆపర్స్,గల్లా అశోక్,
    గల్లా అశోక్ సినిమాలో విలన్‌గా జగపతి బాబు (File/Photos)


    ఈ షెడ్యూల్లో జగపతిబాబుతో పాటు అశోక్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం జగపతి బాబు హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘తానాజీ’లో ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంతో జగపతి బాబు బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు దర్శన్ హీరోగా నటిస్తోన్న ‘రాబర్ట్’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్, సత్య, అర్చన సౌందర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు