‘అల్లుడుగారు వ‌చ్చారు’.. కార్తికేయ రాక‌పై జ‌గ‌ప‌తిబాబు ఫుల్ హ్యాపీస్..

జగపతిబాబు సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా బాగానే పాపులర్. తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇందులో అభిమానులతో పంచుకుంటాడు జగ్గూభాయ్. ఇప్పుడు కూడా ఇదే చేశాడు. తన కొత్త అల్లున్ని సంక్రాంతి పండక్కి ఇంటికి పిలిచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ విశేషాలు పంచుకున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 12, 2019, 3:46 PM IST
‘అల్లుడుగారు వ‌చ్చారు’.. కార్తికేయ రాక‌పై జ‌గ‌ప‌తిబాబు ఫుల్ హ్యాపీస్..
జగపతిబాబు కార్తికేయ
  • Share this:
జగపతిబాబు సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా బాగానే పాపులర్. తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇందులో అభిమానులతో పంచుకుంటాడు జగ్గూభాయ్. ఇప్పుడు కూడా ఇదే చేశాడు. తన కొత్త అల్లున్ని సంక్రాంతి పండక్కి ఇంటికి పిలిచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ విశేషాలు పంచుకున్నాడు. ఈయన కూతురుకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది కదా.. పైగా ఫారెన్ ఆయ‌న‌కు సంక్రాంతి.. ఇప్పుడు కొత్తల్లుడు ఏంటి అనుకుంటున్నారా..? రాజమౌళి కొడుకు కార్తికేయ ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు అల్లుడు.జ‌గ్గూభాయ్ అన్న కూతురు పూజనే కార్తికేయ పెళ్లి చేసుకున్నాడు. ఆ మధ్య పెళ్లి ఘనంగా జరిగింది కూడా. ఇప్పుడు పండక్కి కొత్త ఇంటికి వచ్చాడు అల్లుడు. దాంతో ఇన్ స్టాగ్రామ్ లో అల్లుడు ఉన్న ఫోటో షేర్ చేశాడు జగపతిబాబు. ప్రస్తుతం ఈ ఫోటో బాగానే వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో కార్తికేయ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.. ఇప్పుడు అల్లుడుగారు ఇంటికి వచ్చారు అంటూ పోస్ట్ చేశాడు జ‌గ్గూభాయ్. ఇది చూసి ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

రజినీకాంత్ పరిస్థితేంటి.. ‘పేట’ క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయి..?


జంధ్యాల‌.. ఇవివి స‌త్యనారాయ‌ణ‌.. ఇప్పుడు అనిల్ రావిపూడి..


నాని ‘జెర్సీ’ టీజ‌ర్.. ప్రయత్నిస్తూ ఓడిపోయే వాడు లేడు..

First published: January 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>