news18-telugu
Updated: December 5, 2020, 12:06 AM IST
varun tej
అన్నయ్య మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విలన్‌తో ఇప్పుడు తమ్ముడు వరుణ్‌తేజ్ తలబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అసలు వివరాల్లోకెళ్తే.. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాకు బాక్సర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి లాంగ్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేస్తే.. కోవిడ్ ప్రభావంతో ఆగిన షూటింగ్ ఈమధ్యనే పునః ప్రారంభమైంది. అయితే చెల్లెలు నిహారిక పెళ్లి పనులను వరుణ్ తేజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ నుండి వరుణ్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇది వరకు అన్నయ్య రామ్‌చరణ్ హీరోగా చేసిన రంగస్థలంలో విలన్‌గా నటించిన జగపతిబాబు, ఇప్పుడు తమ్ముడు వరుణ్ తేజ్‌కి కూడా విలన్‌గా చేయనున్నాడన్నమాట. మరి జగపతిబాబు విలనిజం స్టైలిష్‌గా ఉంటుందా లేక మాస్ తరహాలో ఉంటుందా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
గద్దల కొండ గణేశ్, ఎఫ్ 2 చిత్రాల తర్వాత వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. తొలిసారి బాక్సర్ రోల్ చేస్తున్నాడు వరుణ్. ఏదో ఆషామాషీగా చేసేయాలనే ఉద్దేశంతో కాకుండా వరుణ్‌తేజ్ ఈ రోల్ కోసం చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అమెరికాలో బాక్సింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ తేజ్, అది కూడా ఆషామాషీ ట్రైనర్ దగ్గర కాదు.. ఓలింపిక్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ దగ్గర వరుణ్ తేజ్ ప్రత్యేకమైన శిక్షణను తీసుకోవడం విశేషం. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది
మెగాఫ్యామిలీలో తమ్ముడు సినిమా కోసం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కిక్ బాక్సర్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్ మాత్రమే అలాంటి పాత్రలో కనిపిస్తుండటం విశేషం. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకని హ్యాట్రిక్ హిట్స్ హీరోగా మారుతాడేమో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
Published by:
Anil
First published:
December 5, 2020, 12:06 AM IST