హోమ్ /వార్తలు /సినిమా /

Jagapathi Babu: 'రుద్రంగి' ఫస్ట్ లుక్.. భీకరంగా జగపతి బాబు!!

Jagapathi Babu: 'రుద్రంగి' ఫస్ట్ లుక్.. భీకరంగా జగపతి బాబు!!

Jagapathi Babu Rudrangi News 18

Jagapathi Babu Rudrangi News 18

Jagapathi Babu Rudrangi First look: సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'రుద్రంగి'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు సీనియర్ హీరో జగపతి బాబు (Jagapathi Babu). ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రుద్రంగి' (Rudrangi). ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్న యూనిట్.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ (Rudrangi First Look) రిలీజ్ చేశారు.

దీనికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్శించింది. అలా ఈ రోజు (సోమవారం) 'రుద్రంగి' ఫస్ట్ లుక్ ని టైటిల్ మోషన్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేయగా అందులో నటుడు జగపతి బాబుని భీకరంగా, జాలి- దయ లేని 'భీమ్ రావ్ దొర' గా పరిచయం చేశారు.

ఉత్కంఠ పెంచేలా ఉండే నేపథ్య సంగీతం తో తీసుకెళుతూ "రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ" అని జగపతి బాబు డైలాగ్ తో ముగించే లోపు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుకుంటున్నాయి. కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో 'రుద్రంగి' చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులతో తెరకెక్కిస్తున్నారు.

బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ కి ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావడంతో అదే జోష్ లో చిత్రాన్ని థియేటర్లలో అతి త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు.

Published by:Sunil Boddula
First published:

Tags: Jagapathi babu, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు