జగపతిబాబు పెద్ద మనసు.. కష్టకాలంలో పదివేల మందికి తోడుగా..

దేశంలో క‌రోన కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల కూలీ పనులు చేసుకుంటూ ఏ పూటకాపుట పొట్టనింపుకునే కార్మికులు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కుంటున్నారు.

news18-telugu
Updated: May 30, 2020, 2:41 PM IST
జగపతిబాబు పెద్ద మనసు.. కష్టకాలంలో పదివేల మందికి తోడుగా..
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ జగపతి బాబు Photo : Twitter
  • Share this:
దేశంలో క‌రోన కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల కూలీ పనులు చేసుకుంటూ ఏ పూటకాపుట పొట్టనింపుకునే కార్మికులు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కుంటున్నారు. దీంతో వీరిని ఆదుకునేందుకు సామాజిక సృహ, సమాజం పట్ల సోయి ఉన్న సినీ సెలెబ్రీటీస్, రాజకీయ నాయకులు, సామాన్యులు కూడా తోచిన విధంగా కొంత మంది డబ్బు రూపంలో సాయం చేస్తే మరికొంత మంది వస్తు రూపంలో సాయం చేస్తూ కష్టకాలంలో తోటి వారికి తోడుగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల విల‌క్షణ‌ న‌టుడు జ‌గపతిబాబు ‌చాలా మంది సినీ కార్మికులకు తానే స్వ‌యంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించాడు. అలాగే క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఎన్‌95 మాస్కులు, శానిటైజర్లను అందించాడు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులలో ఉన్న‌ ప‌దివేల మంది పేద‌ల‌కి నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్కులు, శానిటైజర్లను అంద‌జేశాడు జ‌గ‌ప‌తి బాబు. ఈ సాయం గురించి ఆయన మాట్లాడుతూ.. 'స‌హాయం చేసిన మాట వాస్త‌వ‌మే కాని చేసిన ప్ర‌తి స‌హాయం అంద‌రికీ తెలియాల్సిన అవ‌సరం లేదు క‌దా… ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేశాను' అని తెలిపాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు హీరోగా ఇరగదీసిన జగపతి బాబు ప్రస్తుతం వయస్సుకు తగ్గట్లుగా పాత్రలు చేస్తూ విలన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను అదరగొడుతున్నాడు.

Jagapathi Babu, Jagapathi Babu news, Jagapathi Babu films, Jagapathi Babu movies, జగపతి బాబు, corona, lockdown, tollywood, tollywood news
కష్టకాలంలో తోడుగా జగపతి బాబు Photo : Twitter
Published by: Suresh Rachamalla
First published: May 30, 2020, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading