చిరంజీవి సినిమాలో కీలక పాత్ర చేయనున్న ఆ స్టార్ హీరో..

మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్టైనా లూసిఫర్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 3, 2020, 7:27 AM IST
చిరంజీవి సినిమాలో కీలక పాత్ర చేయనున్న ఆ స్టార్ హీరో..
చిరంజీవి Photo : Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్టైనా లూసిఫర్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ ఘన విజయం పొందిన ఈ సినిమాను చిరంజీవి ప్రధాన పాత్రలో సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్నాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే కోరుకోవడంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక 'సాహో' వంటీ భారీ సినిమా తీసి తన సత్తా చాటుకున్న యువకుడు సుజీత్, తెలుగు వర్షన్‌లో ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్ర తెలుగు వెర్షన్ లో చిరు చేస్తుండగా కథలో భారీ మార్పులే జరుగుతున్నాయట. చిరు ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సుజీత్ తెలుగు వర్షన్ లో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరో భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

అయితే ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా మొన్నటి వరకు తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో సుహాసిని నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఆ పాత్రలో అందాల ఖుష్బూ నటించనుందని తెలుస్తోంది. ఖుష్బూ గతంలో స్టాలిన్ సినిమాలో కూడా ఆయనకు సోదరిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జగపతిబాబుని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రకు జగపతి బాబు అయితేనే కరెక్ట్ గా సరిపోతాడని అనుకుంటోందట చిత్రబృందం. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ ఆచార్య లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
First published: July 3, 2020, 7:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading