‘సరిలేరు నీకెవ్వరు’ మూవీపై తనను తప్పించడంపై జగ్గూభాయ్ క్లారిటీ...

‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.  ఐతే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబును ఎంచుకున్నారు. ఐతే ఇటీవ‌ల ఆ సినిమా నుంచి జ‌గ‌ప‌తిబాబు త‌ప్పుకున్నారు. తాజాగా తనను తొలిగించడంపై జరగుతున్న ప్రచారానికి మహేష్ బాబు చెక్ పెట్టాడు.

news18-telugu
Updated: July 19, 2019, 4:28 PM IST
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీపై తనను తప్పించడంపై  జగ్గూభాయ్ క్లారిటీ...
జగపతిబాబు ఫైల్ ఫోటో
  • Share this:
‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.  ఐతే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబును ఎంచుకున్నారు. ఐతే ఇటీవ‌ల ఆ సినిమా నుంచి జ‌గ‌ప‌తిబాబు త‌ప్పుకున్నారు. దీంతో ఈ సినిమా కథ చెప్పే సమయంలో దర్శకుడు ఏమైతే జగ్గూ భాయ్ కి చెప్పారో .. షూటింగ్‌కు వెళ్లిన తర్వాత ఆ కథ మరోలా ఉండడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. జగ్గూభాయ్ ఈ సినిమాను తప్పుకోవడం వెనక అనిల్ రావిపూడితో ఉన్న విభేదాలే కారణమని వార్తలు వినబడ్డాయి. తాజాగా ఈ పుకార్లుకు పులిస్టాప్ పెడుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై జగపతి బాబు ఓ వీడియోను  విడుదల చేసాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తాను ఒక  క్యారెక్టర్ చేయాల్సి ఉన్న.. ఏవో పర్సనల్ కారణాలతో  స్వచ్ఛందంగా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. నేను నా 33 ఏళ్ల కెరీర్‌లో ఎవరితో గొడవ పడింది లేదంటూ ఓ వీడియోను విడుదల చేసాడు.


మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘సరిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలోని పాత్ర‌ను జ‌గ‌ప‌తిబాబు చాలా ఇష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టులో భాగం కావాల‌ని ఆయ‌న భావించారు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆయ‌న సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే జ‌గ‌ప‌తిబాబుగారితో ప‌నిచేసే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేసాడు.ప‌రిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు స‌ర్` అంటూ జగపతి బాబును ఉద్దేషిస్తూ అనిల్ ట్వీట్ చేశాడు. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సినిమాలో జగపతి బాబు తొలగింపు జరుగుతున్న ప్రచారాలకు వీళ్లిద్దరు చెక్ పెట్టారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 19, 2019, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading