Home /News /movies /

JACQUELINE FERNANDEZ SHOULD BE SHOCKED TO KNOW THE RENT OF THE HOUSE WHERE SHE IS STAYING IN MUMBAI TA

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉంటున్న ఇంటి అద్దె ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ Photo : Instagram

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ Photo : Instagram

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో  ఉంటున్న ఇంటి అద్దె ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే.

    Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో  ఉంటున్న ఇంటి అద్దె ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే..  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ సినిమాల్లో తన అందచందాలతో ఊపేస్తోన్న నటి. ఈ ముద్దుగుమ్మ  శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ కొలంబోలో జన్మించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2006లో మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్‌  అందాల కిరిటాన్ని కైవసం చేసుకుంది.  సెక్సీ ఫిగర్‌తో, హాట్ హాట్ లుక్స్‌తో అదరగొడుతూ.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. హిందీలో ‘అలాదిన్’ సినిమాతో పలకరించింది. ఆ తర్వాత ‘హౌస్‌ఫుల్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘కిక్’ సినిమాతో వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు ఈ భామ.. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యాడ్ బాయ్’ అనే ఐటెం సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే కదా. ఇక బాలీవుడ్‌ సినిమాల్లో కోట్లకు కోట్లు గడిస్తున్న ఈ భామకు ముంబైలో ఉండటానికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. లేదని కాదు కానీ.. కొనడానికి డబ్బులు చాల ా ఉన్న.. ఇప్పటికే ప్రియాంక చోప్రా సంబంధించిన ఫ్లాట్‌లో ఉంటోందట.

    ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ బిల్డింగ్‌‌ను ప్రియాంక చోప్రా నాలుగు, ఐదు అంతస్తులను ప్రియాంక మూడేళ్లకు లీజుకు తీసుకుందట. అంతేకాదు ఈ ఫ్లాట్స్‌కు సంబంధించి నెలకు రూ. 6.78 లక్షలు నెలకు అద్దె రూపంలో చెల్లిస్తోందట. ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఫ్లాట్‌లో మారినప్పటి నుంచి జాక్వెలిన్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయట. అందుకే ముంబైలో సొంత ఫ్లాటు కొనుక్కునే స్థోమత ఉన్న .. ప్రియాంకకు సంబంధించిన అద్దె ఇంట్లోనే ఉంటూ వస్తోంది. మొత్తంగా దేశ రాజధానికి పొట్ట కూటి కోసం ధారవి లాంటి ప్రాంతంలో రూ. 500 కు అద్దె కుండే వారితో పాటు లక్షలు లక్షలు పోసి అద్దెలు చెల్లెంచే సెలబ్రిటీలున్నారు. మొత్తంగా తమకు నచ్చితే.. అద్దె రూపంలో రూ. లక్షలు పెట్డడానికి వెనకాడని సెలబ్రిటీలు ముంబైలో ఉన్నారన్న విషయం మరోసారి జాక్వెలిన్‌ ఉదంతంతో మరోసారి ఋజువైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Jacqueline Fernandez, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు