హోమ్ /వార్తలు /సినిమా /

Jacqueline Fernandez: మనకున్నది ఒకే జీవితం.. మనం అలా చేద్దాం అంటున్న బాలీవుడ్ నటి..?

Jacqueline Fernandez: మనకున్నది ఒకే జీవితం.. మనం అలా చేద్దాం అంటున్న బాలీవుడ్ నటి..?

Jacqueline Fernandez

Jacqueline Fernandez

Jacqueline Fernandez: ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కోవిడ్ వల్ల దారుణంగా ఉండటంతో.. ప్రజలకు సహాయం చేయడానికి ఎంతోమంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.

Jacqueline Fernandez: ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కోవిడ్ వల్ల దారుణంగా ఉండటంతో.. ప్రజలకు సహాయం చేయడానికి ఎంతోమంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆక్సిజన్, ప్లాస్మా వంటివి అందించడానికి తమ వంతు సహాయం తో ముందుకు వస్తున్నారు. ఇక ఓ యంగ్ హీరో అనాథ పిల్లల బాధ్యతను కూడా తీసుకున్నాడు‌ తాజాగా మరో బాలీవుడ్ నటి ఈ సమయంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ఓ సంస్థను స్థాపించింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు..

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈమె గురించి బాలీవుడ్ పరిచయమున్న ప్రేక్షకులకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ సర్వీస్‌ల పై కూడా బాగా ఆసక్తి చూపుతుంది. ఇక తాజాగా ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని.. ఇటీవలే తను 'యూ ఓన్లీ లివ్ వన్స్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి చేస్తున్న ఆమె కృషిని చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సంస్థ ద్వారా ఇతరులకు తమ వంతు సహాయం చేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపింది జాక్వెలిన్. ఆకలి కడుపునిండినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందని మదర్ థెరిసా అన్నారని తెలిపింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ శివ నందన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'రోటి బ్యాంకు' ను సందర్శించారు. ఇక ఈ సందర్భంగా పేదలకు భోజనానికి కూడా వడ్డించారు. ఈ రోటి బ్యాంకు ను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని తెలిపింది. ఇక ఈ సమయంలో ఈ సంస్థ ఎంతో మంది కడుపు నింపుతుందని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.

First published:

Tags: Bollywood heroine, Corona virus, Covid-19, Jacqueline Fernandez, Pandemic situation, Shocking message, Tollywood heroine