• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JACQUELINE FERNANDEZ OPENS UP ABOUT SPENDING TIME AT GOOD FRIEND SALMAN KHANS FARMHOUSE SR

సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో ప్రభాస్ భామ.. ఆ పనుల్లో ఫుల్ బిజీ..

సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లో ప్రభాస్ భామ.. ఆ పనుల్లో ఫుల్ బిజీ..

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ Photo : Instagram

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ సినిమాల్లో నటిస్తూ తన అందచందాలతో మతిపోగుడుతోన్న శ్రీలంకన్ బ్యూటీ.

  • Share this:
    Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ సినిమాల్లో నటిస్తూ తన అందచందాలతో మతిపోగుడుతోన్న శ్రీలంకన్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ కొలంబోలో జన్మించింది. జాక్వెలిన్ శ్రీలంకన్ మాజీ మిస్ యూనివర్స్‌ అని తెలిసిదే. జాక్వలిన్‌... ప్రభాస్ 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే ఐటెమ్ సాంగ్‌లో తన అంద చందాలతో చంపేసింది. అయితే క్షణం తీరిక లేకుండా గడిపే ఈ భామ ప్రస్తుతం కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా ఫాంహౌస్ లలో ఉంటూ తనకు నచ్చిన పనులు చేస్తూ కాలం గడిపేస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబై సమీపంలోని పన్వేల్ ఫాంహౌస్ లో కొందరు స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ ఫామ్ హౌస్ హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ది కావడం ఇక్కడ విశేషం. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ అమ్మడు రోజు ఏం చేస్తుంది. తన జీవితం ప్రస్తుతం ఎలా ఉంది.. మొదలగు విషయాలను తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫాంహౌస్ లో ప్రతిరోజు రెండు సార్లు హార్స్ రైడింగ్ చేస్తున్నానని జాక్వెలిన్ తెలిపింది. అంతేకాకుండా గుర్రాలకు స్నానం చేయిస్తున్నానని, గుర్రపుశాలను శుభ్రం చేస్తున్నానని.. రోజురోజుకీ ఈ పనుల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నానని పేర్కోంది. జాక్వెలిన్ సినిమాల విషయానికి వస్తే ఈ భామ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న విరూపాక్షలో ఓ హీరోయిన్‌గా చేస్తుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటూ పెద్దవారిని దోచుకుని పేదవారికి సాయం చేస్తుందట.
    View this post on Instagram

    Selfie King! My sunrise buddy 💙

    A post shared by Jac’kill’ine Fernandez (@jacquelinef143) on



    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు