టిక్‌టాక్ ఇండియా క్వీన్‌గా ప్రభాస్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్..

ప్రస్తుతం యూత్ మొత్తం ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు చాలా వరకు ఎడిక్ట్ అయ్యారు. రీసెంట్‌గా వీటన్నింటికీ పోటీగా వచ్చిన టిక్‌టాక్ రేసులో అందరికంటే ముందుంది. తాజాగా 2019 టిక్‌టాక్ ఇండియా క్వీన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నిలిచింది.

news18-telugu
Updated: December 20, 2019, 11:11 AM IST
టిక్‌టాక్ ఇండియా క్వీన్‌గా ప్రభాస్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్..
ప్రభాస్,జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Youtube/Credit)
  • Share this:
ప్రస్తుతం యూత్ మొత్తం ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు చాలా వరకు ఎడిక్ట్ అయ్యారు. రీసెంట్‌గా వీటన్నింటికీ పోటీగా వచ్చిన టిక్‌టాక్ రేసులో అందరికంటే ముందుంది. ఇక టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్‌తో రాత్రికి రాత్రి పాపులర్ అయిన వాళ్లు ఉన్నారు. తాజాగా 2019 టిక్‌టాక్ ఇండియా క్వీన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నిలిచింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. ఈ ఇయర్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంలో బ్యాడ్‌బాయ్ సాంగ్‌లో ప్రభాస్ సరసన ఆడిపాడిన సంగతి తెలిసిందే కదా. తాజాగా టిక్ టాక్.. 2019 రివైండ్ ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్ వీడియాల జాబితా విడుదల చేసింది. ఈ లిస్టులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎక్కువ మంది ఫాలోవర్స్‌తో మొదటిస్థానంలో నిలిచి టిక్‌టాక్ క్వీన్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. జాక్వెలిన్ తర్వాత  6.8 మిలియన్స్ ఫాలోవర్స్‌తో రితేష్ దేశ్‌ముఖ్ రెండో స్థానంలో నిలిచాడు. 2.2 మిలియన్ ఫాలోవర్స్‌తో కపిల్ శర్మ మూడో స్థానంలో నిలిస్తే.. 1.2 ఫాలోవర్స్‌తో మాధురి దీక్షిత్ నాల్గో ప్లేస్‌లో నిలిచింది. జాక్వెలిన్ ఎప్పటి కప్పుడు తన అందా చందాలతో అభిమానులను అలరించడమే కాదు. తనదైన స్టైల్లో టిక్‌టాక్‌తో అభిమానులను సంపాదించుకుంది.

First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు