హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth: అనసూయ షాకింగ్ కామెంట్స్.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. వాళ్లను వదిలేసి వచ్చేస్తా..

Jabardasth: అనసూయ షాకింగ్ కామెంట్స్.. నువ్వు లేకుంటే చచ్చిపోతా.. వాళ్లను వదిలేసి వచ్చేస్తా..

నన్ను టచ్ చేయాలి అనే మాట రాగానే మళ్లీ రెచ్చిపోయాడు ఆది. దానికోసమే కదా వెయిట్ చేస్తున్నది.. అంటూ ముందుకు వచ్చేసాడు. దాంతో అనసూయ నవ్వి ఊరుకుంది. ఈ మొత్తం సీక్వెన్స్ ప్రోమోలో బాగా హైలైట్ అయింది. కచ్చితంగా వచ్చే వారం ఈ స్కిట్ మాత్రం పేలిపోవడం ఖాయం.

నన్ను టచ్ చేయాలి అనే మాట రాగానే మళ్లీ రెచ్చిపోయాడు ఆది. దానికోసమే కదా వెయిట్ చేస్తున్నది.. అంటూ ముందుకు వచ్చేసాడు. దాంతో అనసూయ నవ్వి ఊరుకుంది. ఈ మొత్తం సీక్వెన్స్ ప్రోమోలో బాగా హైలైట్ అయింది. కచ్చితంగా వచ్చే వారం ఈ స్కిట్ మాత్రం పేలిపోవడం ఖాయం.

అనసూయ తీరుపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లై.. ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ.. ఈ కామెంట్స్ చేయడం కరెక్టేనా అందని మండిపడుతున్నారు. ఇలాంటి స్కిట్లతో సభ్య సమాజానికి ఏం సందేశాలు ఇస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

జబర్దస్త్‌ కామెడీ షోలో జంటల రొమాన్స్ కొత్తేం కాదు. సుడిగాలి సుధీర్-రష్మీ జోడీకి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరిపై ఇప్పటి వరకు ఎన్నో స్కిట్‌లు చేశారు. స్పెషల్ సాంగ్స్ కూడా వేశారు. అనసూయ-హైపర్ ఆది జంటపైనా ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్-వర్ష జంటకు ఉన్న ఫాలోయింగ్‌ను కూడా మల్లెమాల క్యాష్ చేసుకుంటోంది. వీరంతా కొత్త కొత్త కాన్సెప్ట్‌లు.. స్కిట్‌లతో.. ప్రతి వారం అలరిస్తూనే ఉన్నారు. ఐతే తాజాగా అనసూయ-హైపర్ ఆది మరోసారి రెచ్చిపోయారు. వీరిద్దరు చేసిన స్కిట్.. అందులో అనసూయ చేసిన కామెంట్స్.. ఇప్పుడు హట్ టాపిక్‌గా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. అసలు యాంకర్ అనసూయ ఏమన్నారు? సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలేంటి?

వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమోను తాజాగా యూట్యూబ్‌లో విడుదలయింది. హైఆపర్ ఆది తన స్కిట్‌లో యాంకర్ శివను గెస్ట్‌గా తీసుకొచ్చారు. అందులో సూపర్ సినిమాలోని 'లై డిటెక్టింగ్ మెషీన్' కామెడీకి స్కూఫ్ చేశారు. యాంకర్ అనసూయను పిలిచి మెషీన్ సమక్షంలో కొన్ని ప్రశ్నలు అడిగితారు. ఆది గురించి నీ అభిప్రాయం ఏంటని అడగడంతో.. అతడు మంచి వాడని అనసూయ సమాధానం చెబుతుంది. ఐతే అది అబద్ధమన్నట్లుగా మెషీన్ అరుస్తుంది. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పినా.. అది అరుస్తుంది. '' ఏంటీ.. మా ఇంట్లో వాళ్లను వదిలేసి నీతో వచ్చేస్తా.. ఆది నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా.. అనాలా..?'' అని అనసూయ ప్రశ్నిస్తుంది. అప్పుడు మెషీన్ ''ఆల్ రైట్.. ఆల్ రైట్''.. అనడంతో జడ్జిలతో సహా అందరూ నవ్వుతారు. ''అబ్బా.. బాగా సెట్ చేశావ్.. అంటూ.. ఆదిని చూస్తూ జడ్జి రోజా కూడా ఎంజాయ్ చేశారు.

ఐతే అనసూయ తీరుపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లై.. ఇద్దరు పిల్లలకు తల్లైన అనసూయ.. ఈ కామెంట్స్ చేయడం కరెక్టేనా అందని మండిపడుతున్నారు. ఇలాంటి స్కిట్లతో సభ్య సమాజానికి ఏం సందేశాలు ఇస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. మరికొందరు మాత్రం అనసూయ, ఆదికి మద్దతుగా ఉన్నారు. ఇదంతా స్క్రిప్ట్ బాస్.. కేవలం ఫన్ కోసమే అలా చేశారని వెనకేసుకొస్తున్నారు. ప్రతి దానిని భూతద్దంలో పెట్టి చూడవద్దని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షో ఎండింగ్‌లో అనసూయపై యాంకర్ శివ కూడా ఊహించని కామెంట్స్ చేశారు. మీరు పొట్టి దుస్తులు వేసుకుంటారని విమర్శలు వస్తున్నాయి కదా.. వాటిపై మీ అభిప్రామేంటని అడగడంతో.. అనసూయకు కోపం వస్తుంది. ఇలాంటి వారిని షోకు ఎందుకు తీసుకొస్తారని.. స్టేజిపై నుంచి వెళ్లిపోయారు. ఐతే ఇదంతా ప్రోమో కోసమే చేశారని.. టీఆర్పీ రేటింగ్స్ కోసం చీప్ ట్రిక్స్ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

First published:

Tags: Anasuya Bharadwaj, Anchor anasuya, Extra jabardasth, Jabardasth, Tollywood

ఉత్తమ కథలు