JABARDASTH YODHA QUESTIONED SUDIGALI SUDHEER IN JABARDASTH SKIT NR
Sudigali Sudheer: జబర్దస్త్‌లో సుధీర్‌కు ఘోర అవమానం.. నువ్వు యాక్టర్ ఎలా అయ్యావ్ అంటూ?
Sudigali Sudheer
Sudigali Sudheer: బుల్లితెర స్టార్ కమెడియన్ గా నిలిచి ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్
Sudigali Sudheer: బుల్లితెర స్టార్ కమెడియన్ గా నిలిచి ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఘోర అవమానాన్ని ఎదుర్కున్నాడు సుధీర్.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ తన కామెడీ టైమింగ్స్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా పోవే పోరా అనే ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేసి బాగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేస్తూ తన పర్ఫామెన్స్ లతో బాగా నవ్విస్తాడు. ఇవే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా యాంకరింగ్ చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక జడ్జిల నుండి తెగ ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంటాడు.
మరో యాంకర్ రష్మీతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో ఎంట్రీలో పిల్లలు బాగా సందడి చేసారు. ఇక సుధీర్ ఒక పాపతో నీకు ఏం కావాలి అమ్మా అంటూ ప్రశ్నించాడు. వెంటనే ఆ పాప.. నీ మైకు నాకు ఇవ్వచ్చుగా.. నీకు ఎందుకు అని పంచ్ వేయగా వెంటనే అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకోగా సుధీర్ షాక్ అయ్యాడు.
ఇక వెంటనే మరో పాపను చూపిస్తూ.. ఈ పాపను చూస్తుంటే మంచి యాక్టర్ గా ఉందని అన్నాడు. కానీ యాక్టర్ అంటే ఫేస్ లో నవరసాలు పలకాలి లేదంటే కష్టమని అనడంతో.. వెంటనే నువ్వెలా అయ్యావు అని పంచ్ వేసింది. వెంటనే సుధీర్ అవమానంగా ఫీల్ అయినట్లు ఫేస్ పెట్టాడు. దీంతో అందరూ తెగ నవ్వుకోగా ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.