జబర్దస్త్‌లో కోత మొదలైందా.. ఏ నిమిషానికి ఏమి జరుగునో..?

Jabardasth Comedy Show: కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనే ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పుడూ లేనంతగా ఈ షోపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. దానికితోడు కరోనాతో రెండు నెలలుగా షూటింగ్స్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2020, 10:22 PM IST
జబర్దస్త్‌లో కోత మొదలైందా.. ఏ నిమిషానికి ఏమి జరుగునో..?
ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)
  • Share this:
కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనే ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పుడూ లేనంతగా ఈ షోపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. దానికితోడు కరోనాతో రెండు నెలలుగా షూటింగ్స్ కూడా ఆపేసారు. దానికంటే ముందు ఉన్నట్లుండి నాగబాబు తప్పుకోవడం.. ఆయనతో పాటే చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి వాళ్లు బయటికి వెళ్లిపోవడంతో షో ఒక్కసారిగా కళ తప్పింది. ఏదో వెలితి అయితే కచ్చితంగా కనిపిస్తుంది. నాగబాబు తన దారి తాను చూసుకున్నాడు కానీ కొందరు కమెడియన్లను మాత్రం తీసుకెళ్లాలని విఫలయత్నం చేసాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా షూటింగ్స్ లేని జబర్దస్త్ యాజమాన్యం రేటింగ్స్‌లో వెనకబడిపోయింది.

Jabardasth Comedians afraid about that thing and Nagababu also helpless in this issue pk కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనే ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పుడూ లేనంతగా ఈ షోపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఉన్నట్లుండి నాగబాబు తప్పుకోవడం.. ఆయనతో పాటే చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి.. jabardasth,extra jabardasth,jabardasth comedy show,nagababu jabardasth,jabardasth judge nagababu,jabardasth comedians,jabardasth nagababu zee telugu,jabardasth new judge,jabardasth comedy skits,sudigali sudheer jabardasth,hyper aadhi jabardasth,jabardasth chammak chandra,jabardasth venu wonders,jabardasth shakalaka shankar,jabardasth judge roja,jabardasth anasuya bharadwaj,jabardasth rashmi gautham,telugu cinema,zee telugu,నాగబాబు,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్స్,సుడిగాలి సుధీర్,హైపర్ ఆది,తెలుగు సినిమా,ఎమ్మెల్యే రోజా,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో,
నాగబాబు ఫైల్ ఫోటో

నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కొన్ని రోజులు తేడా కొట్టినా కూడా తర్వాత మళ్లీ సెట్ అయిపోయింది. మునపటి కంటే కూడా మంచి రేటింగ్ తీసుకొచ్చింది ఈ షో. అప్పట్లో నాగబాబుతో కొందరు వెళ్లిపోవాలని చూసినా కూడా వాళ్ల తీరు చూస్తుంటే మారేలా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ కమెడియన్లకు ఇప్పుడు భయం పట్టుకుందని.. ఏం జరుగుతుందో అని తెలియక వణికిపోతున్నారని తెలుస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ముందు వెనక చూసుకోకుండా జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతే కచ్చితంగా తర్వాత పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అది వాళ్లకు తెలియంది కాదు.

Jabardasth Comedians afraid about that thing and Nagababu also helpless in this issue pk కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనే ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పుడూ లేనంతగా ఈ షోపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఉన్నట్లుండి నాగబాబు తప్పుకోవడం.. ఆయనతో పాటే చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి.. jabardasth,extra jabardasth,jabardasth comedy show,nagababu jabardasth,jabardasth judge nagababu,jabardasth comedians,jabardasth nagababu zee telugu,jabardasth new judge,jabardasth comedy skits,sudigali sudheer jabardasth,hyper aadhi jabardasth,jabardasth chammak chandra,jabardasth venu wonders,jabardasth shakalaka shankar,jabardasth judge roja,jabardasth anasuya bharadwaj,jabardasth rashmi gautham,telugu cinema,zee telugu,నాగబాబు,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్స్,సుడిగాలి సుధీర్,హైపర్ ఆది,తెలుగు సినిమా,ఎమ్మెల్యే రోజా,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో,
నాగబాబు సుడిగాలి సుధీర్ హైపర్ ఆది

నాగబాబుకు జబర్దస్త్ వదిలేసినా పోయేదేం లేదు.. జీ తెలుగులో అంతకంటే ఎక్కువ పారితోషికం వస్తుంది. అక్కడ ఆ షో ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఆయన కెరీర్‌కు ఏం కాదు.. కావాలంటే మళ్లీ జబర్దస్త్‌కు వచ్చే సత్తా ఉంది. అదే రెమ్యునరేషన్ తీసుకునే స్టామినా కూడా ఉంది. కానీ జబర్దస్త్ కమెడియన్ల పరిస్థితి అలా లేదు. వాళ్లకు ఇదే జీవితం.. అందుకే రిస్క్ తీసుకోడానికి వణికిపోతున్నారు. గతంలో సినిమా ఛాన్సులు పెరిగాయని బయటికి వెళ్లిన రఘు, వేణు, షకలక శంకర్, ధనాధన్ ధన్‌రాజ్, రచ్చ రవి లాంటి వాళ్లు కనీసం ఇప్పుడు సీన్‌లో కూడా కనిపించడం లేదు.

Jabardasth Comedians afraid about that thing and Nagababu also helpless in this issue pk కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనే ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పుడూ లేనంతగా ఈ షోపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఉన్నట్లుండి నాగబాబు తప్పుకోవడం.. ఆయనతో పాటే చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి.. jabardasth,extra jabardasth,jabardasth comedy show,nagababu jabardasth,jabardasth judge nagababu,jabardasth comedians,jabardasth nagababu zee telugu,jabardasth new judge,jabardasth comedy skits,sudigali sudheer jabardasth,hyper aadhi jabardasth,jabardasth chammak chandra,jabardasth venu wonders,jabardasth shakalaka shankar,jabardasth judge roja,jabardasth anasuya bharadwaj,jabardasth rashmi gautham,telugu cinema,zee telugu,నాగబాబు,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్స్,సుడిగాలి సుధీర్,హైపర్ ఆది,తెలుగు సినిమా,ఎమ్మెల్యే రోజా,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో,
జబర్దస్త్ కమెడియన్స్ (Source: Twitter)

అందుకే నాగబాబు వెళ్లినా కూడా మొండిగా సుధీర్, ఆది లాంటి వాళ్లు ఇక్కడే కనిపిస్తున్నారు. వాళ్లు వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నా కూడా వెళ్లకుండా ఉండాలనే వాళ్ల మనసుల్లో కూడా కోరిక బలంగా ఉంది. అందుకే లైఫ్ ఇచ్చిన షోను వదిలివెళ్లే సమస్యే లేదంటున్నారు వాళ్లు. ఇదిలా ఉంటే జబర్దస్త్ షూటింగ్ మొదలైన తర్వాత కొందరిపై వేటు వేయాలని మల్లెమాల టీం చూస్తుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం నష్టాలు రావడంతో దాన్ని భర్తీ చేయడానికి సరిగ్గా పర్ఫార్మ్ చేయని కమెడియన్స్‌కు చరమగీతం పాడాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ షూట్ మొదలైన తర్వాత చాలా విచిత్రాలు అయితే చూడక తప్పదు.
Published by: Praveen Kumar Vadla
First published: May 21, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading