హైపర్ ఆదికి అనసూయ ఫుల్ సపోర్టు.. అసలేంటీ వీరి ట్రాక్..

జబర్దస్త్ షో కు రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్, హైపర్ ఆది-అనసూయ జోడీ ప్రత్యేక ఆకర్షణ. ఈ జోడీలపై వచ్చే కామెంట్లు, సెటైర్లు.. ప్రేక్షకులకు కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. రష్మీ-సుధీర్ జోడీపై వార్తలు, గాసిప్స్ కామన్ అయిపోయినా.. హైపర్ ఆది, అనసూయ మధ్య ట్రాక్ ఈ మధ్య ప్రేక్షకులకు కాస్త అనుమానం పెంచుతున్నాయి.

news18-telugu
Updated: November 6, 2019, 5:27 PM IST
హైపర్ ఆదికి అనసూయ ఫుల్ సపోర్టు.. అసలేంటీ వీరి ట్రాక్..
అనసూయ,హైపర్ ఆది (ఫైల్ ఫోటోస్)
  • Share this:
జబర్దస్త్ షో కు రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్, హైపర్ ఆది-అనసూయ జోడీ ప్రత్యేక ఆకర్షణ. ఈ జోడీలపై వచ్చే కామెంట్లు, సెటైర్లు.. ప్రేక్షకులకు కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. రష్మీ-సుధీర్ జోడీపై వార్తలు, గాసిప్స్ కామన్ అయిపోయినా.. హైపర్ ఆది, అనసూయ మధ్య ట్రాక్ ఈ మధ్య ప్రేక్షకులకు కాస్త అనుమానం పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆది స్కిట్ నడుస్తున్న సమయంలో కనీసం రెండు, మూడు పంచ్‌లు అనసూయ మీదే ఉంటాయి. ‘అనసూయకు పెళ్లి అయిపోయిందని, తమ జోడీ గద్దలకొండ గణేష్ వరకు వెళ్లిందని..’ తదితర డబుల్ డైలాగులతో తమ మధ్య ఏదో ఉందన్నట్లు చెబుతాడు హైపర్ ఆది. కానీ.. అదంతా వీక్షకుల్లో కాస్త డైలమా పెంచేందుకే తప్ప, వాస్తవానికి వారిద్దరి మధ్య ఏం లేదు. అనసూయకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పైగా.. ఆమెతో హైపర్ ఆదిని పోల్చలేం. వారిద్దరి దారి దేనికదే ప్రత్యేకం. అయితే, ఈ మధ్య అనసూయ, హైపర్ ఆది కావాలనే ఎక్కువ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రోగ్రాం నిర్వాహకులు ఈ గాసిప్‌ను క్యాచ్ చేసుకొని రేటింగ్ పెంచుకోవడానికి తహతహలాడుతున్నారని కూడా అంటున్నారు. రష్మీ-సుధీర్ జోడీ ఎంత హిట్ అయ్యిందో.. ఈ జోడీని కూడా అలా హిట్ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు.

అసలేం జరుగుతోందంటే.. అనసూయ యాంకర్‌గా జబర్దస్త్ షో, రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో నడుస్తున్నాయి. ఎలాగూ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రష్మీ, సుధీర్ ఉంటారు కాబట్టి.. జబర్దస్త్‌లో హైపర్ ఆదికి జోడీగా అనసూయను హైలైట్ చేసి, వ్యూయర్‌షిప్ రాబట్టుకునేందుకు ప్రోగ్రాం నిర్వాహకులు వేసిన ఎత్తుగడే ఇదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. హైపర్ ఆది స్కిట్ నడుస్తున్నంత సేపు అనసూయ మీద కెమెరా ఫోకస్ పెట్టడమే ఇందుకు ప్రధాన కారణమని కూడా అంటున్నారు. ఇక, హైపర్ ఆది ఏ కామెంట్ చేసినా, ప్రత్యేక హావభావాలు పలికించి.. షోను మరింత రక్తి కట్టించేలా అనసూయ కూడా వ్యవహరిస్తోందని చెబుతున్నారు.

మెగా హీరోలు చేసిన సినిమాలకు స్ఫూఫ్ చేస్తూ.. వేరే హీరోలను కూడా అనుకరిస్తూ హైపర్ ఆది స్కిట్‌లు చేస్తున్నాడు. ఆ స్కిట్లపై ప్రేక్షకుల్లో ఒక రకమైన అసహనం వస్తోంది. హీరోలను కించపరిచేలా స్కిట్ చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అయితే.. అతడివి సరికొత్త గెటప్‌లు అంటూ అనసూయ వత్తాసు పలుకుతోందని, అతడి స్కిట్లు హిలేరియస్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తుందని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ జరుపుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, షో రేటింగ్ పెంచుకోవడానికి వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రేక్షకుల్లో భ్రమ కల్పించడానికే చేస్తున్నారని వాదిస్తున్నారు.

First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>