ఒక కన్ను చూపు పోయింది.. నరకం అనుభవిస్తున్నా : జబర్దస్త్ వినోద్

Jabardasth Vinod : దాడి కారణంగా షూటింగ్స్‌కు దూరమయ్యానని.. త్వరలోనే మళ్లీ బిజీ అయిపోతానని చెప్పాడు. తనపై దాడికి పాల్పడినవారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారని.. ఇంటి విషయంలో తనకు న్యాయం జరిగేవరకు చట్టపరంగా పోరాడుతూనే ఉంటానని చెప్పాడు.

news18-telugu
Updated: August 20, 2019, 12:30 PM IST
ఒక కన్ను చూపు పోయింది.. నరకం అనుభవిస్తున్నా : జబర్దస్త్ వినోద్
జబర్దస్త్ వినోద్(File Photo)
news18-telugu
Updated: August 20, 2019, 12:30 PM IST
ఇటీవల ఓ ఇల్లు కొనుగోలు వివాదంలో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన జబర్దస్త్ హాస్య నటుడు వినోద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాడు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతోందని.. కానీ వాళ్లు కొట్టిన దెబ్బలకు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. భుజం వద్ద అయిన గాయం తీవ్రంగా వేధిస్తోందన్నాడు. కళ్లపై బలంగా కొట్టడంతో.. ఒక కన్ను చూపు పోయిందని, ఒకే కన్నుతో మేనేజ్ చేయాల్సి వస్తోందని చెప్పాడు.గాయమైన కన్నుకు చూపు రావాలంటే మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు తెలిపాడు. దాడి కారణంగా షూటింగ్స్‌కు దూరమయ్యానని.. త్వరలోనే మళ్లీ బిజీ అయిపోతానని చెప్పాడు. తనపై దాడికి పాల్పడినవారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారని.. ఇంటి విషయంలో తనకు న్యాయం జరిగేవరకు చట్టపరంగా పోరాడుతూనే ఉంటానని చెప్పాడు.వినోద్ కావాలనే కేసు పెట్టాడని కొంతమంది చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నాడు. ఇంత గాయపడి.. ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం తనకు లేదని చెప్పాడు.

జబర్దస్త్ వినోద్‌పై దాడి : ఎలా మోసపోయాడు.. అసలేం జరిగింది..?

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...