ఈ మాటలు ఎవరన్నారబ్బా అనుకుంటున్నారా..? ఓ కమెడియన్ అన్న మాటలే ఇవి. ఎవరైతే సుడిగాలి సుధీర్ అండ్ టీంను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడో.. ఆ కమెడియన్ అన్న మాటలే ఇవి. ఒకప్పుడు మ్యాజిక్ చేసుకునే సుధీర్.. రైటర్‌గా ఉన్న రాంప్రసాద్.. ఎక్కడో ఉన్న గెటప్ శ్రీనును తన టీంలోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసాడు కమెడియన్ వేణు. జబర్దస్త్ మొదట్లోనే తన స్కిట్స్‌లో వరసగా సుధీర్, శ్రీనుకు అవకాశాలిచ్చి వాళ్లకు లైఫ్ ఇచ్చాడు ఈయన. ఆ తర్వాత సొంతంగా టీం లీడర్స్ అయ్యారు వాళ్ళు. అందులో సుడిగాలి సుధీర్ చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు.. ఈ రోజు బుల్లితెర సూపర్ స్టార్ అయ్యాడు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కూడా.
ఇప్పటికే హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా చేసాడు ఈయన. అయితే అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు 3 మంకీస్ అంటూ మరో సినిమాతో వస్తున్నారు సుధీర్ అండ్ టీం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో వేణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. తను ఇంట్రడ్యూస్ చేసిన ఈ మంకీస్ ఈ రోజు ఇంత స్టార్స్ అవ్వడం.. ఇంత పేరు తెచ్చుకోవడం.. ఫ్యాన్స్‌ను సంపాదించడం ఆనందంగా ఉందని.. అంతకుమించిన గర్వంగా కూడా ఉందని చెప్పుకొచ్చాడు వేణు. తను తీసుకొచ్చినా కూడా వాళ్ల టాలెంట్‌తోనే ఎదిగారని.. ప్రపంచానికి పరిచయం అయ్యారని చెప్పాడు వేణు.
ఇంత ఎదిగినందుకు సంతోషంగానే ఉన్నా కూడా లోపల ఇగో కూడా ఉందని.. ఇంత ఎదుగుతారని తెలిసుంటే కొడుకులను ఆ రోజే తొక్కేసేవాన్ని కదా అంటూ నవ్వుతూ చెప్పాడు వేణు. కానీ ఇదంతా జోక్ మాత్రమే అని.. నిజంగా సుధీర్ అండ్ టీం ఎదుగుదల చూసినపుడు తనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడు వేణు. 3 మంకీస్ సినిమా అద్భుతంగా ఉంటుందని.. అంతా చూసి ఆశీర్వదించండి అంటూ తన శిష్యులను పొగిడేసాడు వేణు. జబర్దస్త్ నుంచి ఈయన వెళ్లిపోయిన తర్వాత ఈ మధ్యే అదిరిందిలో మళ్లీ తన కామెడీ మొదలుపెట్టాడు. మొత్తానికి ఏదేమైనా కూడా వేణు చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood