హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth Varsha: జబర్దస్త్ వర్షకు ప్రమాదం.. ఆ షోలో స్కిట్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి?

Jabardasth Varsha: జబర్దస్త్ వర్షకు ప్రమాదం.. ఆ షోలో స్కిట్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి?

jabardasth varsha

jabardasth varsha

Jabardasth Varsha: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష. బుల్లితెర లో పలు సీరియల్స్ లో నటిస్తూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్దస్త్ లో కమెడియన్ గా నిలిచి తన పర్ఫార్మెన్ తో మంచి పేరు అందుకుంది. ఇక మోడల్ గా కూడా చేసింది వర్ష.

ఇంకా చదవండి ...

Jabardasth Varsha: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష. బుల్లితెర లో పలు సీరియల్స్ లో నటిస్తూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్దస్త్ లో కమెడియన్ గా నిలిచి తన పర్ఫార్మెన్ తో మంచి పేరు అందుకుంది. ఇక మోడల్ గా కూడా చేసింది వర్ష. జబర్దస్త్ లో కేవలం గెస్ట్ గా పాల్గొన్న వర్ష ఆ తర్వాత అక్కడే సెటిలై బుల్లితెర ప్రేక్షకులతో మరింత ఎక్కువ పరిచయం పెంచుకుంది. సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో ఇంత క్రేజ్ అందుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ ఇమ్మానియేల్ అని చెప్పవచ్చు. అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది. ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది.

అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో తన నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది.ఇక జీ తెలుగులో ప్రతి ఆదివారం ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్న సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఇందులో ప్రతి వారం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ టీమ్స్ లను పిలిచి వారితో బాగా సందడి చేస్తుంటాడు యాంకర్ ప్రదీప్.

ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. అందులో ప్రేమ ఎంత మధురం సీరియల్ టీమ్ తో పాటు రామ సక్కని సీత సీరియల్స్ వాళ్లు పాల్గొన్నారు. దీంతో ప్రేమ ఎంత మధురం నుండి పలువురు నటులు పాల్గొని బాగా సందడి చేశారు.ఇక వర్ష మహేష్ బాబు పాట పాడగా వెంటనే ప్రదీప్ ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. రెండు టీమ్ లతో గేమ్ లో భాగంగా ప్రశ్నలు వేస్తూ బాగా నవ్వించాడు.

https://youtu.be/T8L2u2IM40I

మధ్య మధ్యలో తన పంచులతో బాగా సరదాగా చేశాడు ప్రదీప్. ఇక ప్రేమ ఎంత మధురం హీరోయిన్ అను.. ప్రదీప్ కు రివర్స్ పంచ్ వేసి ఫన్నీ క్రియేట్ చేసింది. అలా కొన్ని గేమ్స్ ఆడించగా.. అందులో వేదికపై జబర్దస్త్ వర్ష ఓ తోపుడు బండిపై వస్తూ దానిపైన జారి పడింది. ఇక ఏం జరిగిందో తెలియదు గానీ అందరూ చూసి షాక్ అయ్యారు. ఇక ప్రదీప్ కు ఓ నటుడు ఓ గిఫ్ట్ అందించగా అందులో తన తండ్రితో పాటు తన ఫోటోను చూసి కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. మొత్తానికి ఈ ప్రోమో బాగా సరదాగా ఆకట్టుకుంది.

First published:

Tags: Anchor pradeep, Jabardasth Varsha, Prema entha madhuram, Rama Sakkani Seetha, Super serial championship, Tollywood

ఉత్తమ కథలు