Home /News /movies /

JABARDASTH VARSHA MARRIES KARTHIK IN FRONT OF EMMANUEL IN NEXT WEEK PROMO SK

Jabardasth: ఇమ్మూను దారుణంగా మోసంచేసిన వర్ష.. కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది

ఇమ్యాన్యుయేల్, వర్ష, కార్తీక్ (Image:ETVJabardasth)

ఇమ్యాన్యుయేల్, వర్ష, కార్తీక్ (Image:ETVJabardasth)

Jabardasth: ఇమ్మాన్యుయేల్ కళ్ల ముందే కార్తీక్‌కు పెళ్లి చేసుకుంది. ఇమ్మూ చూస్తున్న సమయంలో.. కావాలని మరీ కార్తీక్‌తో రొమాన్స్ చేసింది వర్ష.

    జబర్దస్త్‌లో నవ్వుల పువ్వులు పూయడమే కాదు.. ప్రేమలు కూడా చిగురిస్తున్నాయి. ఇప్పటికే యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జంటకు బయట బీభత్సమైన క్రేజ్ ఉంది. ఈ జంట స్క్రీన్‌పై కనిపించిందంటే ప్రేక్షకులకు పండగే. రష్మీ, సుధీర్ జోడీ భలే ఉంటుందని.. వారి కెమిస్ట్రీ అదుర్స్ అని ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరు కేవలం కామెడీ కోసమే రొమాన్స్ చేసినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. వీరి తర్వాత అనసూయ, ఆది జంట కూడా అంతే ఫేమస్ అయింది. స్కిట్‌కు ముందు కలిసి స్టెప్పులేయడం, ఆ తర్వాత పంచ్‌లు వేయడంతో.. వీరిద్దరికి కెనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు.

    అనసూయ, ఆది.. ఈ మధ్య పెద్దగా కలిసి స్కిట్‌లు చేయడం లేదు. ఐతే వారి స్థానంలో జబర్దస్త్ స్టేజిపై కొత్త జంట సందడి చేస్తోంది. వారే ఇమ్యాన్యుయేల్-వర్ష. వీరిద్దరి ఒకే టీమ్‌లో పనిచేయడం, అందులోనూ లవర్స్‌గా నటిస్తుండడంతో.. జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.  మీ జంట కేక అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఇమ్మూ చాలా మంచి వ్యక్తి అని.. తన బెస్ట్ ఫ్రెండ్ అని పలు సందర్భాల్లో చెప్పింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు జబర్దస్త్ నిర్వాహకులు కూడా.. వీరిద్దరి చుట్టూనే స్కిట్‌ను నడిపిస్తోంది. ఐతే వచ్చే శుక్రవారానికి సంబంధించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది.

    అందులోనూ ఇమ్మూ, వర్షాల సందడే హైలైట్‌గా నిలిచింది. ఎప్పటిలాగే ఇమ్మూన్యుయేల్‌పై ప్రేమను కురిపించింది వర్ష. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీస్తే నా గుండెల్లో నీ ఫొటో వచ్చిందని చెప్పడంతో.. జడ్జిలు పగలబడి నవ్వుతారు. ఐతే అంతలోనే ప్లేట్ ఫిరాయించింది వర్ష. ఇమ్మాన్యుయేల్ కళ్ల ముందే కార్తీక్‌కు పెళ్లి చేసుకుంది. ఇమ్మూ చూస్తున్న సమయంలో.. కావాలని మరీ కార్తీక్‌తో రొమాన్స్ చేసింది వర్ష. ఈ ప్రోమోపై నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. ఇమ్మూను వర్ష దారుణంగా మోసం చేసిందని సరదాగా అభిప్రాయడుతున్నారు. మరి ఇమ్మూను వర్ష ఎందుకు మోసం చేసిందో తెలియాలంటే వచ్చే వారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ దాక వేచి చూడక తప్పదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jabardasth, Jabardasth comedy show, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు