Jabardasth Emmanuel-Varsha: ఇమ్మాన్యుయల్ తల్లిని చూసి ఏడ్చేసిన వర్ష.. మంచి అబ్బాయిని ఇచ్చారంటూ..

ఇమ్మాన్యుయేల్ తల్లితో వర్ష ( Image: YouTube)

Jabardasth Emmanuel Varsha: వర్షతో జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆమెను వర్ష ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

  • Share this:
    జబర్ధస్త్‌లో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఓ రైజింగ్ స్టార్. అతడు చేస్తున్న స్కిట్స్ ఈ షోను మరింత పైకి తీసుకెళుతున్నాయి. ఇక జబర్ధస్త్ ద్వారా తాను ఎదగడంలోనూ ఈ యంగ్ కమెడియన్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. జబర్ధస్త్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో తనదైన మార్క్ చూపిస్తూ పలు స్కిట్స్‌కు మంచి రేటింగ్ వచ్చేలా చేయడంలోనూ ఇమ్మాన్యుయల్ విజయం సాధిస్తున్నాడనే టాక్ ఉంది. ఇక వర్షతో ఇమ్మాన్యుయల్ లవ్ స్టోరీ కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. తాజాగా ఇమ్మాన్యుయల్ పాల్గొంటున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ షోలో జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లిదండ్రులు, అన్నను పరిచయం చేశారు.

    ఈ సందర్భంగా ఇమ్మాన్యుయల్ తన భావోద్వేగాన్ని ఆపులేకపోయాడు. తన కొడుకు తమను ఈ స్టేజ్‌పై నిలబెట్టడంపై ఇమ్మాన్యుయల్ తల్లి కూడా సంతోషం వ్యక్తం చేసింది. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకు చాలా మంచివాడని.. ఎంత మంచివాడో మాటల్లో చెప్పలేనని తెలిపింది. ఇక తన అన్న ప్రొత్సాహం లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని.. తన గురించి తన అన్న ఎంతో కష్టపడానని చెప్పాడు. ఇక ఈ స్టేజ్ మీదే ఇమ్మాన్యుయల్ తల్లిని వర్ష ఆలింగనం చేసుకుంది. ఇంత మంచి అబ్బాయిని తనకు ఇచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పింది. అయితే ఇదే సమయంలో ఇమ్మాన్యుయల్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన కొడుకు వల్ల వర్షకు ఎలాంటి సమస్య రాదని ఆమె స్టేజ్‌పై చెప్పింది. తన కొడుకు చాలా మంచివాడని తెలిపింది. మొత్తానికి జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లిని వర్ష ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published: