Home /News /movies /

JABARDASTH VARSHA EMOTIONAL GOOD NEWS TO VARSHA FANS SHE SAYS WILL NOT LEAVE JABARDASTH SU

Jabardasth Varsha: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన జబర్దస్త్‌ వర్ష.. ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు..

జబర్దస్త్ వర్ష( Image-Varsha Instagram)

జబర్దస్త్ వర్ష( Image-Varsha Instagram)

జబర్దస్త్‌లో ఎంట్రీ తర్వాత వర్ష క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలుత ఒకటి రెండు స్కిట్స్‌లో అలా వచ్చి వెళ్లిపోయిన వర్ష.. కొద్ది రోజులకే జబర్దస్త్‌లో సెట్ అయిపోయింది.

    జబర్దస్త్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది వర్ష. అంతకు ముందు కొన్ని సీరియల్స్‌లో నటించిన రాని గుర్తింపు వర్షకు జబర్దస్త్‌తో వచ్చింది. జబర్దస్త్‌లో ఎంట్రీ తర్వాత వర్ష క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలుత ఒకటి రెండు స్కిట్స్‌లో అలా వచ్చి వెళ్లిపోయిన వర్ష.. కొద్ది రోజులకే జబర్దస్త్‌లో సెట్ అయిపోయింది. ఇమాన్యుయేల్‌తో జోడి కట్టాక..  వర్ష ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్‌ మీద చేసే హడావిడి గురించి అందరికి తెలిసిందే. జబర్దస్త్ స్టేజ్ మీద వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా మందిని అలరించింది. అయితే అదే విధంగా వీరి మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష, ఇమాన్యుయేల్ పెళ్లి పేరుతో చేసిన షోపై కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. పెళ్లి పేరుతో నాటకాలు ఏమిటని ప్రశ్నించారు.

    ఇదిలా ఉంటే వర్ష, ఇమాన్యుయేల్‌ల జోడిపై, పెళ్లి పేరుతో వీరు చేసిన షోపై జబర్దస్త్‌లో‌నే కామెడీగా కౌంటర్లు పడిపోయాయి. ఇందుకు సంబంధించి జబర్దస్త్ స్టేజిపైనే ఇమాన్యయేల్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఓ వైపు బయట ట్రోలింగ్స్, మరోవైపు జబర్దస్త్ స్కిట్స్‌లో కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోను కొద్ది సేపటికే డిలీట్ చేయడం సరికొత్త చర్చకు దారితీసింది. ఎందుకంటే అందులో వర్ష.. జబర్దస్త్ సెట్‌లో వేరుగా ఉంటుంది, బయట వేరుగా ఉంటుందని ఎమోషనల్ అయింది. తన తమ్ముడు ఫేస్ మీద ఫోన్ పెట్టి.. ఏంటక్కా ఇది అని అడిగితే తట్టుకోలేకపోయానని చెప్పింది. ఈ క్రమంలోనే ఆమె కంటతడి పెట్టుకుంది. అయితే ఆ ప్రోమోను డిలీట్ చేసి.. మరో కొత్త ప్రోమోను అప్‌లోడ్ చేశారు. అయితే అందులో వర్షకు సంబంధించిన పార్ట్‌ లేకుండా పోయింది.

    దీంతో వర్ష.. జబర్దస్త్‌ను వీడుతుందా..? అనే ప్రచారం మొదలైంది. చాలా మంది జబర్దస్త్ వీడాలని వర్ష నిర్ణయం తీసుకుందని.. అందుకే ప్రోమోను డిలీట్ చేశారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే వాటన్నింటికి తాజాగా ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్‌తో క్లారిటీ వచ్చేసింది.

    బుల్లెట్ భాస్కర్ స్కిట్ అనంతరం.. వర్షపై వస్తున్న ట్రోల్స్‌ గురించి ఆమెను రోజా ప్రశ్నించింది. ‘మన వరకు అవన్నీ చాలా ఈజీ. మనం ఇక్కడ వేరు.. మన ఇంట్లో వేరు. అమ్మాయిల ఈ సెట్‌కు వచ్చినప్పుడు చాలా గౌరవం ఇస్తారు. కానీ ఈ ట్రోల్స్ మాత్రం.. వర్ష నువ్వు ఎవడితోనైనా పోయావా..?, వర్షకు ఎవడైనా ఉన్నాడా..?.. అది నా తమ్ముడు ఫేస్‌ మీద ఫోన్ పెట్టి.. ఎంటక్క అని చెబితే నేను ఫేస్ చేయలేకపోయాను’అని ఆవేదన వ్యక్తం చేసింది. వర్ష చెప్పిన మాటలపై రోజా స్పందిస్తూ.. 100లో 90 మంది ఎంకరేజ్ చేస్తారని, 10 మంది మాత్రం అలాంటి వాళ్లు ఉంటారు.. వాళ్ల గురించి పట్టించుకోవద్దని అన్నారు. ఇక, వర్ష మాటలకు యాంకర్ రష్మీ సపోర్ట్‌గా నిలిచారు.

    ‘ఇక్కడ అందరం వర్క్ చేస్తున్నామని.. కానీ పర్సనల్ లైఫ్ వేరే. అబ్బాయిల ఎంత మందితోనైనా పులిహోర కలిపిన పర్వాలేదు.. కానీ అమ్మాయిలు క్యారెక్టర్ పరంగా వేరే వాళ్లతోని నటిస్తే ఒప్పుకోరు. ఎందుకో అర్థం కాదు. ట్రోల్స్‌ విషయానికి వస్తే.. వాళ్లు బతుకుతుందే దీని మీద. అవన్నీ అలసు పట్టించుకోవద్దు’ అని రష్మీ చెప్పింది.

    ఈ క్రమంలోనే జబర్దస్త్‌ను వీడటంపై వర్ష క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా తాను జబర్దస్త్‌లో కొనసాగుతానని స్పష్టం చేసింది. ఏమైనా అనుకోండి.. నేను ఇక్కడే ఉంటానని ట్రోలర్స్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. తాను పక్కా పోరాడతానని వెల్లడించారు. ఇంకేముంది వర్ష చేసిన ప్రకటనలో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వర్షకు మద్దతుగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే వర్ష జబర్ధస్త్‌లో కొనసాగాలని అంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Extra jabardasth, Jabardasth, Jabardasth Varsha, Rashmi Gautam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు